Wednesday, November 23, 2011

క్రిష్ కోసం అనుష్క మళ్లీ టాలీవుడ్ వస్తోందట


డైరెక్టర్ క్రిష్ సెక్సీ స్వీటీ అనుష్కల మధ్య ప్రేమాయణం సాగుతోందని ఎన్నాళ్లగానో టాలీవుడ్ సినీజనం ఒకటే గుసగుసలు పోతున్నారు.............ఇటీవల అనుష్క కోలీవుడ్ అవకాశాలతో బిజీ అయిపోవడంతో టాలీవుడ్‌కు దూరమైంది. దీంతోపాటే ఆమెపై రూమర్లు కూడా వెనక్కిపోయాయి. ఇపుడు మళ్లీ డైరెక్టర్ క్రిష్ - అనుష్క ప్రేమాయణం జరుగుతూనే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి హీరోగా క్రిష్ణం వందేజగద్గురుం చిత్రంలో అనుష్కను నటింపజేసేందుకు క్రిష్ సంప్రదిస్తే అనుష్క వెనుకా ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. దీంతో మళ్లీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం తగ్గలేదనీ, ఏదో ఒకరోజు ఇద్దరూ ఏదో కబురు చెపుతారని అంటున్నారు టాలీవుడ్ సినీజనం.

No comments:

Post a Comment