Saturday, November 26, 2011

మామూలు ముద్దుతో కొద్దిగా లాభం.. గాఢ చుంబనమైతే అబ్బో బోలెడంత...

లిప్ టు లిప్ ముద్దుతో ప్రయోజనాలు చాలానే ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలిందట. గాఢమైన ముద్దు పెట్టుకునేటపుడు స్త్రీ పురుషుల నయనాలు వాటంతట అవే మూసుకుంటాయి.......................... ఇందుకు కారణం.. శరీరం అనిర్వచనీయమైన అనుభూతిని పొందడమే అని చెపుతున్నారు. సుదీర్ఘమైన గాఢ చుంబనంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుందట. ఇటువంటి ముద్దు ఇచ్చేటపుడు నాడీ స్పందనలు నిమిషానికి 110సార్లు నమోదవుతాయట. ఇది గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చుతుందని చెపుతున్నారు వైద్య నిపుణులు.

అంతేకాదు ముద్దు శ్వాసక్రియకు కూడా మేలు చేస్తుంది. ముద్దిచ్చేటపుడు శ్వాస తీసుకోవడం నిమిషానికి 60సార్లు ఉంటే, అదే సాధారణ స్థితిలో నిమిషానికి 20 సార్లుగా నమోదవుతుంది.

ముద్దు అనేది స్త్రీపురుషుల మధ్య బంధాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది. కనుక రోజూ భార్యభర్తలు కనీసం మూడునాలుగు ముద్దులతో మునిగిపోతే మంచిదంటున్నారు. అంతేకాదండోయ్... ముద్దిస్తే కొవ్వు కూడా కరుగుతుందట. ముద్దు ఇచ్చినందుకుగాను నిమిషానికి 2 నుంచి 3 క్యాలరీల శక్తి ఖర్చవుతుందట. రోజుకు కనీసం మూడు ముద్దులిచ్చేవారిలో అదనంగా చేరే కొవ్వు కరిగిపోయే అవకాశం ఉన్నదట.

ముద్దు ఒత్తిడిని మాయం చేసే మహత్తర సాధనమని కూడా కనుగొన్నారు. మంచి గాఢమైన చుంబనం మానసిక ఆందోళనను, ఒత్తిడిని మాయం చేసి కొత్తశక్తిని ఇస్తుంది.

ముద్దుపెట్టుకునేటపుడు ముఖంలోని 30 కండరాలకు మంచి స్పందన ఉంటుంది. ఫలితంగా ముఖానికి ఓ రకమైన వ్యాయామం దొరికినట్లయి, ముఖం కాంతివంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది. తరచుగా ముద్దుల్లో మునిగిపోయేవారిలో క్షుద్బాధలు, రక్తానికి సంబంధించి వ్యాధులు దూరమవుతాయని తేలింది. ముద్దిచ్చే సమయంలో స్త్రీపురుషుల లాలాజలం ఓ రకమైన మత్తును కలిగించేదిగా ఉంటుంది. కిస్ చేసిన సమయంలో పరస్పర మార్పిడి జరిగి మత్తులో మునిగిపోతారు. ఐతే ముద్దిచ్చేవారు, ముద్దు పుచ్చుకునేవారు నోళ్లు ఆరోగ్యంగా ఉంటేనే ఈ ఫలితాలు వర్తిస్తాయి అని చిన్న సూచన కూడా చేశారు పరిశోధకులు.

No comments:

Post a Comment