Wednesday, January 25, 2012

మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో తప్పతాగి తూలుతున్న మనీషా కొయిరాలా

ఒకే ఒక్కడు, బాంబే, కిల్లర్ చిత్రాల్లో నటించిన ఒకనాటి గ్లామర్ తార మనీషా కొయిరాలా......................ఇటీవల కొత్తగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్లో తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ప్రశాంత్ చౌదరితో కలిసి తప్పతాగి కనబడింది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ పిలుపు మేరకు మనీషా సదరు రెస్టారెంట్‌కు వెళ్లిందట.
బాగా పొద్దుపోయే ఇద్దరూ ఏకాంతంగా చాలా విషయాలు చర్చించుకున్నారట. ఆ తర్వాత మనీషా పీకల దాకా మందుగొట్టి నిషా కిక్కులో ఊగిపోతూ.. జారగిల పడిపోయిందట. ఆ స్థితిలో మనీషాను అతి కష్టమ్మీద ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ చౌదరి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడట.
ఇదిలావుండగా ఆమధ్య నేపాల్‌కు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న మనీషా.. పెళ్లయిన దగ్గర్నుంచి ఏదో పోగొట్టుకున్నదానిలా కనబడుతోందట. పైపెచ్చు తాజాగా రెస్టారెంట్లో మందుగొట్టిన సమయంలోనూ ఆమె ముఖం బాగా వాడిపోయి కనబడిందట. రంగుల లోకంలో ఇటువంటి నిషా కిక్కులు మనకు చాలానే కనబడుతుంటాయి.

No comments:

Post a Comment