Thursday, January 5, 2012

హాఫ్ సెంచరీ రికార్డు

హీరోలేకాదు.. హీరోయిన్లు కూడా.. హాఫ్‌ సెంచరీ చిత్రాలు చేస్తున్నారు. అయితే ఇది చాలా అరుదు. హీరోలైతే దానికి పెద్ద బిల్డప్‌ ఇచ్చి.. ప్రచారం చేసుకుంటారు. హీరోయిన్లు వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ త్రిష మాత్రం ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లయింది.
తాజాగా వెంకటేష్‌తో 'బాడీగార్డ్‌' చేసింది. అది సంక్రాంతికి విడుదల కాబోతుంది. తర్వాత 'దమ్ము'తో ముందుకు రాబోతుంది. దీంతో తమిళ తెలుగు చిత్రాలు కలిపి మొత్తం 45 సినిమాలు అయ్యాయి. ఇంకా ఐదు చిత్రాలు చేసేస్తే... హాఫ్‌ సెంచరీ అవుతుంది.

హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్న నేటి ట్రెండ్‌లో దాదాపు 50 సినిమాలకు దగ్గరగా రావడంతో.. ఆమెతో సినిమాలు పూర్తి చేయడానికి రిలయెన్స్‌ సంస్థతోపాటు పలువురు ముందుకు వచ్చారు. దీంతో ఆమెకు 50 సినిమాలు త్వరలో పూర్తవుతాయన్నమాట. త్రిష మంచి సినిమాలు చేస్తున్నట్లుగానే.. రికార్డును సొంతం చేసుకుంటున్నది ఫిలింనగర్‌ వాసులు అంటున్నారు.

No comments:

Post a Comment