Monday, July 2, 2012

శృంగారానికి కావాల్సింది రెండు దేహాలు మాత్రమే కాదు!!

romance couple
అనేక మంది జంటలు శృంగారం అంటే రెండు శరీరాల కలయికగా భావిస్తుంటారు. ఇలాంటి భావన ఉండటం.................. వల్లే "ఆ" కార్యాన్ని తూతూ మంత్రంగా పూర్తి చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన ఉన్న యువతీ యువకులు తమ భావనను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు. శృంగారానికి కావాల్సింది రెండు దేహాలు మాత్రమే కాదనీ, ప్రేమ, అప్యాయత, భద్రత, బాధ్యత, బంధం, నమ్మకం అనేవి ఉండాలని వారు కోరుతున్నారు.

ఆధునిక జీవితంలో తమ దినచర్యలకే అధిక ప్రాధాన్యతనిస్తూ అత్యంత విలువైన శృంగార జీవన మాధుర్యాన్ని దంపతులు కోల్పోతుంటారు. శృంగారానికి తమ జీవితంలో చివరి స్థానం ఇచ్చే దంపతుల్లో ఏదో అసంతృప్తి కూడా అంతే స్థాయిలో ఉంటుంది.

పడక గది అవతల, ఇంటి లోపల, బయటా భార్యా భర్తలు ప్రేమగా, సన్నిహితంగా పరస్పర గౌరవంతో మెలగకపోతే బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించాక చుట్టూ ఉన్న వాతావరణం ఎంత అందంగా ఉన్నా వారు మానసికంగా శారీరక కలయికకు సిద్ధం కాలేరంటున్నారు. పైపెచ్చు.. శృంగారానికి మానసిక సాన్నిహిత్యం, దానిలోంచి పుట్టిన భావ వినిమయం, భావ ప్రకటనలు అనేవి చాలా ముఖ్యమని అంటున్నారు.

అంతేకాకుండా, శృంగారం ఇక్కడ దేహభాష మాత్రమే కాదనీ, మనోభాష కూడా అని చెపుతున్నారు. ఇక్కడ మనసు శరీరంతో సంభాషిస్తుందని, శరీరం మనసుకు సహకరిస్తుందంటున్నారు. దంపతులు తమ ప్రేమను మనస్ఫూర్తిగా స్పర్శ ద్వారా ప్రకటించుకునే అద్భుతమైన దేహభాష శృంగారమని చెపుతున్నారు. ఈ రకమైన శృంగారానికి కావాల్సింది రెండు దేహాలు మాత్రమే కాదు. ప్రేమ, అప్యాయత, భద్రత, బాధ్యత, బంధం, నమ్మకం- చిట్ట చివరగా మాత్రమే దేహాలు వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment