Monday, July 9, 2012

మెన్సస్ సమయంలో వద్దంటున్నా.. సెక్స్ కావాలంటున్నారు?

women
మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి సమయాల్లో భార్యలు చికాకు పడి.. భర్తకు దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. నిజానికి మెన్సస్ అయిన సమయంలో స్త్రీతో శృంగారంలో పాల్గొన వచ్చా అనే అంశంపై సెక్స్ వైద్యులను, గైనకాలజిస్టులను సంప్రదిస్తే కింది విధంగా అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కానిది మగవారికి మాత్రమే. ఈ సమయంలో స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో పాటుగా, తీవ్రమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావంతో నీరసం లాంటివి ఉంటాయి.

మానసికంగా కూడా ఆమెకు సాంత్వననివ్వాలి. ఇలాంటి సమయాల్లో మహిళలకు పూర్తి విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులైతే స్త్రీలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనవుతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు.

నెలసరప్పుడు శృంగారంలో పాల్గొనవద్దు. పాల్గొంటే అధిక రక్తస్రావం - నొప్పి ఎక్కువ అవుతాయి. పురుషులు - మగ డాక్టర్లనడిగి ఏం కాదు, పాల్గొనవచ్చు అంటారు. కానీ, స్త్రీలు ఆ సమయంలో విపరీతమైన బాధను, చిరాకుని అనుభవిస్తారు. కాబట్టి, నెలసరి అప్పుడు శృంగారం అసలు వద్దనే వద్దని చెప్పాలని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment