'ఎన్టీఆర్'.. ఇండస్ట్రీలో మాస్ హీరోగా పేరున్న నటుడు. తన మాస్, యాక్షన్ హీరోగా టాలీవుడ్ ను ఏలిన యంగ్ టైగర్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఇప్పటి వరకు మాస్ టచ్ తో నెట్టుకొచ్చాడు. కానీ రీసెంట్ గా వచ్చిన చిత్రాలు ఫ్లాప్ లు చవి చూడడంతో తనలో మార్పులు చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే తన అభినయంతో పాటు ఆహార్యం కూడా మార్చుకున్నాడు. ఇప్పుడు తన లుక్ పై శ్రద్ద పెట్టాడు. 'బృందావనం'తో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని కూడా తన వైపు కు తిప్పుకున్నాడు. 'బాద్షా' లో న్యూ హెయిర్ స్టైల్ తో ప్రెంచ్ కట్ తో కనిపించి, తన ఫ్యాషన్ ని ఫాలో అవుతానని చెప్పకనే చెప్పాడు.
దసరాకి సందడి చేయబోతున్న 'రామయ్యా వస్తావయ్యా'తో తన బాడీ లాంగ్వేజ్ నుండి క్యాస్టూమ్స్ వరకూ చాలా కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ మాస్ లుక్ తో వుండే ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా ట్రెండీ గా తయారయ్యాడు. సో.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని గుర్తించిన ఈ యంగ్ టైగర్ తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. 'రామయ్య వస్తావయ్యా'తో యంగ్ టైగర్ మరో కొత్త రకం ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడని చిత్ర టీమ్ నమ్మకంగా వుంది. అయితే దీనికోసం అమెరికా నుంచి ప్రత్యేక టైనర్స్ ను తెప్పించుకున్నారట. సో..ఎన్టీఆర్ ఇక అన్ని కేటగిరిల అభిమానుల ఆకట్టుకునే పనిలో పడ్డాడని టాలీవుడ్ టాక్. మరి ఆయన కొత్త లుక్ ను చూడాలంటే 'రామయ్యా' విడుదల వరకు ఆగాల్సిందే.
No comments:
Post a Comment