Wednesday, December 4, 2013

పురుషులలో గ్యాస్ కారణం అయ్యే కూరగాయలు

కూరగాయలు మీ శరీరంనకు సహజ రూపంలో అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతేకాక మీ ఆహారంలో ఒక ఆరోగ్యకరమైన భాగంగా ఉన్నాయి.అయితే కొన్ని కూరగాయల వలన కొన్ని అవాంఛిత దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉన్నది. కాయగూరలు మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందించటమే కాకుండా,మీ ఉదరంలో సాధారణ గ్యాస్ ఏర్పడటానికి మరియు కడుపు ఉబ్బరం సంభవించటానికి కారణం అవుతాయి. భోజనం ముందు మరియు తరువాత కూడా తరచుగా వాయువుల నుండి మీకు ఉపశమనం లేక చాలా అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, కొంత మందికి అధిక గ్యాస్ ఏర్పడి తద్వారా నొప్పి కూడా ప్రారంభమవుతుంది. కూరగాయలలో వివిధ రూపాల్లో ఉన్న రాఫ్ఫినోస్,లాక్టోజ్,ఫ్రక్టోజ్ మరియు సార్బిటాల్ వంటి చక్కెరలు మీ శరీరంలో సాధారణ గ్యాస్ ఏర్పడటానికి కారణం అవుతాయి. కూరగాయలలో కనిపించే రాఫ్ఫినోస్ అనే క్లిష్టమైన చక్కర అధిక ఉబ్బరం మరియు వాయువు సంబంధించిన కడుపు నొప్పికి కారణం అని తెలిసినది. కొన్ని ఆహారాలు ఎక్కువ గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. అయినప్పటికీ,ప్రతి వ్యక్తీ లోను గ్యాస్ ఉత్పత్తి ఒకేలా ఉండకుండా భిన్నంగా ఉంటుంది. మీరు కొన్ని కూరగాయలను భోజనంలో సమృద్ధిగా తీసుకున్నప్పుడు,భోజనం చేసిన తరువాత గ్యాస్ ఏర్పడటాన్ని గుర్తించి మరియు అసాధారణతను గమనించాలి. ఈ విధంగా గమనించినప్పుడు మీరు తప్పనిసరిగా ఆ కూరగాయలను తీసుకోవడం తగ్గించటం చాలా ముఖ్యం. పొట్టలో అదనపు గ్యాస్ ను ప్రేరేపించటానికి ఉల్లిపాయలు,పచ్చికూరలు,క్యారెట్లు,బ్రస్సెల్స్ మొలకలు,దోసకాయ,క్యాబేజీ,కాలీఫ్లవర్, రాడిష్ మొదలైన కూరగాయలు ఉన్నాయి. మీరు పూర్తిగా గ్యాస్ ను నివారించేందుకు ఇటువంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినటం ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటి పరిమాణంను తగ్గించి తీసుకోవాలి. అంతేకాక వాటిని ఎక్కువ క్రమ విరమాలలో తీసుకోవటం మంచిది. ఇక్కడ పురుషులకు సాధారణం కంటే అదనపు గ్యాస్ కలిగించే కొన్ని కూరగాయలు ఉన్నాయి.

No comments:

Post a Comment