మనిషిలో ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం పెరగడానికి చక్కని ఆరోగ్యం అవసరం. మంచి ఆరోగ్యానికి సమతులాహారం, రోజువారీ వ్యాయామ ప్రక్రియలు చాలా సహకరిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని చేకూరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో
జీవించగలిగినవారు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. జీవితాన్ని ఆనందంగా, సాఫీగా గడుపుతారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందరు మనుషులూ ఒకలా ఉండరు. కొదరు, సన్నగా, లావుగా, పొడవుగా,పొట్టిగా, ఇలా రకరకాలుగా ఉంటారు. ఇతరులను చూసి పోల్చుకుని న్యూనతకు గురికాకూడదు. ఆత్మస్థైర్యం కోల్పోకూడదు. మనకి తగిన, అనువైన వ్యాయామాలను ఎంచుకుని ఫలితాలు సాధించాలి. తగిన వ్యాయామం చేయడంతో శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. ఆశయ సాధనలో అడ్డంకులను ఎదుర్కునే శక్తి లభిస్తుంది.శరీరంలో కలిగే మార్పుల వలన ఎటువంటి ఆందోళనలకు గురి కాకుండా తాను రూపొందించుకున్న వ్యాయామ ప్రక్రియల ప్రకారం ఒక సదవగాహన ఏర్పరుచుకుని ప్రతిరోజూ కొనసాగించాలి. వ్యాయామ ప్రక్రియల వలన కలిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటి వలన ఆశించిన ఫలితాలను సాదించినప్పుడల్లా ఒక పుస్తకంలో రికార్డు చేసుకోవాలి. మిమ్మల్ని ప్రోత్సహించి, మీ ఆశయాలు, మనస్తత్వానికి అనుకూలంగా స్పందించే వ్యక్తులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వ్యాయామం గురించి, కలుగుతున్న అనుకూల మార్పుల గురించీ మాట్లాడాలి.

No comments:
Post a Comment