ప్రపంచంలో, ఏ కాస్త విరామ సమయం దొరికినా సంతోషిస్తారు. ఎందుకంటే, రోజంతా పని ఒత్తిడి, బాధలను పగలు మాత్రమే కాకుండా రాత్రి సమయాలలో నిద్రించే వరకూ కూడా తీసుకెళుతారు కొందరు. దాంతో నిద్రించే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కష్టం అవుతుంది. ఇక పసిపిల్లలు ఉంటే మరింత కష్టం అవుతుంది.
ఎందుకంటే మనం పనిచేసే ప్రదేశంలో ఒత్తిడితో కూడిన పని, వ్యక్తుల మధ్య సంబంధాలు, ఆర్థిక స్థితిగతులు ఎన్ని ఉన్నా ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. కాబట్టి నిద్రించడానికి ముందు మనసును విశ్రాంతి పరచుకోవడం చాలా అవసరం. మనసుతో పాటు శరీరం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. మరి అవేంటో తెలుసుకోవాలని మీకూ ఉంది కదూ...
హార్ట్ హెల్త్ : విశ్రాంతి తీసుకోకపోతే మీ గుండె పని విధానం సమర్థవంతంగా ఉండదు. కాబట్టి మీరు ఆరోగ్య వంతమైన గుండె కోరుకుంటున్నట్లైతే మీ శరీరానికి అవసరమైనపుడల్లా విశ్రాంతి అందివ్వడం మంచిది.
ఒత్తిడి: ప్రతి రోజూ అలసిన శరీరానికి తగినంత విశ్రాంతిని అందివ్వడం వల్ల ఒత్తిడి హార్మోన్లు నియంత్రించబడతాయి. కనుక మీలోని ఒత్తిడి తగ్గించుకొన్నట్లైతే శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మజిల్ టెన్షన్: అవసరానికి అనుగుణంగా విశ్రాంతి తీసుకోవడం వల్ల మజిల్స్ వదులయ్యి అలసట నుండి భయటపడేలా చేస్తుంది.
రక్తపోటు: ప్రతి రోజూ విశ్రాంతి తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
మానసికత: విశ్రాంతి మీ మనసు ఏకాగ్రతను పెంచుతుంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది.
కోపం: మనిషి తగినంత విశ్రాంతి తీసుకోకపోతే కోపం, చిరాకు ఎక్కువవుతాయి. కనుక విశ్రాంతి తీసుకోవడం వల్ల కోపం తగ్గించుకోవచ్చు. తద్వార మీరు అనవసరమైన కోపాలకు, చిరాకులకు దూరంగా ఉండవచ్చు.
ఇలా చేసినా విశ్రాంతే
రాయడం: మీరు మీ వ్యక్తిగత డైరీ లేదా చిన్న కధలు రాసినట్లైతే, మీ మనసులోని ఆలోచనలను కాగితంపై పెడితే నిస్సందేహంగా ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంతది. ఇది మీ జీవిత సమస్యలను పరిష్కరించుకోడానికి, మీ ఊహలను అమలు చేయడానికి సృజనాత్మకతను అందిస్తుంది.
తోటపని: తోటపని మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ప్రతిరోజూ మీరు అనుభవించే ఒత్తిడి ప్రకృతితో తగ్గుతుంది. మీరు బైటికి వెళ్ళినపుడు పచ్చని చెట్లను, పూల అందాలను పొగడంతో మీ మనసు సహజంగా విశ్రాంతి పొందుతుంది.
చదవడం: పుస్తకాల పఠనం ఒత్తిడిని దూరంచేస్తుంది. మీకు ఇష్టమైన మంచి పుస్తకాలను సేకరించి చూడండి, అప్పుడు మీరు పొందిన ఆనందం ముందు మీరు ఎంత కోల్పోయారో ఆశ్చర్యపోతారు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. మంచి పుస్తకాలు చదవండి. తాజా శక్తితో మిమ్మల్ని మీరు తెలుసుకోండి.
సంగీతం వినడం: మీరు పని ఒత్తిడిలో ఉన్నపుడు, అందమైన ప్రశాంతమైన సంగీతాన్ని పెట్టడం మీరు మొట్టమొదట చేయవలసిన పని. సంగీతం మీ మనసు శీర్షాలకు, స్థిరమైన ఆందోళనలకు ఉపశమనాన్ని ఇస్తుంది. సంగీతం మనసుకు ఆందోళన కలిగించే విషయాల నుండి దూరంగా ఉంచి, ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

No comments:
Post a Comment