ఆయన ఓ ఉన్నత కులానికి చెందిన వారే కావొచ్చు. కానీ సెంటు భూమిలేదు. కులానికి అహకారం ఉండొచ్చు.. ఈయనకు ప్రేమానురాగాలు పంచడమే తెలుసు. ఈ సమాజంలో గౌరవంగా బతకాలన్న ఆశే ఆయనను ఓ మనస్సున్న మనిషిని చేసింది. తనకు తాత ముత్తాతలు, తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులు లేవు. తనో ఇంటి వాడైనప్పటి నుంచి తన ఆత్మబలాన్ని నమ్ముకునే ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 12 ఏళ్లుగా చిన్న హోటల్‌ను నడుపుకుంటూ నెట్టుకొస్తున్నాడు. తన పిల్లలను పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వారిని చేశాడు. అందుకోసం ఉన్న కాస్తంత ఇంటి స్థలాన్నీ విక్రయించక తప్పలేదు. ఆనాటి నుంచి నేటి వరకు తాను గూడు కట్టుకునేందుకు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులను కాసింత స్థలాన్ని, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ఆర్థించాడు. ఎవరూ కనికరించలేదు.
తన వారసునికి ఏ దారీ చూపకుండా వెళ్తానేమోనన్న భయంతో నిత్యం మదనపడుతున్నాడు. ఆ వ్యక్తే ఎంపి పటేల్‌గూడ గ్రామానికి చెందిన అంకనగారి విఠల్‌రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ప్రతి కుటుంబానికి కూడు, గూడు, గుడ్డ కల్పిస్తామని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 ఎన్నికల సందర్భంగా హామీనిచ్చారు. ఆ తరువాతా ఎన్నో హామీలిచ్చి ఎందరికో ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన విఠల్‌రెడ్డికి ఇవ్వలేదు. ఆయన పదవీ కాలం ముగిసి మళ్లీ గద్దెనెక్కారు. కానీ అప్పట్లో ఇంటి స్థలం, ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న అంకనగారి విఠల్‌రెడ్డి ఇల్లు రాలేదు. వైఎస్‌ఆర్ తరువాత రోశయ్య, ఆ తరువాత కిరణ్ కుమార్‌రెడ్డి ఆ గద్దెనెక్కారు. పేదల కోసం ఆహా.. ఓహో.. అని చెప్పుకోవడమే తప్ప ఇలాంటి పేదలను నిర్ధాక్షిణ్యంగానే పక్కకు తోసిపుచ్చుతోందన్న నిజం ఈ లబ్ధిదారున్ని చూస్తే అర్థమవుతోంది.
ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఎంపి పటేల్‌గూడ గ్రామానికి చెందిన అంకనగారి విఠల్‌రెడ్డి, ఊర్మిళ దంపతులు. వీరికి ఐదుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఇంతకాలం ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చిన విఠల్‌రెడ్డికి పెద్ద పరీక్షే ఎదురైంది. పెళ్లీడుకొచ్చిన పెద్ద కూతురు పెళ్లి చేసేందుకు ఉన్న ఇల్లును కొంత మొత్తానికి విక్రయించి ఆ ఇంట్లోనే పెళ్లి చేశాడు. అనంతరం అప్పో, సప్పో చేసి రెండో కూతురు పెళ్లీ చేశాడు. అనంతరం ఆ ఇల్లును విక్రయించిన వారు ఇంటినుంచి గెంటేయడంతో దిక్కులేని వారిగా బయటకు వచ్చారు. అద్దెకు ఓ ఇంట్లో ఇంటూ అందులో సగభాగం వరకు చిన్న హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
ఇరవై ఏళ్లుగా ఇంటి స్థలం లేదు: విఠల్‌రెడ్డికున్న ఒకే ఒక్క ఆధారం ఇల్లు. ఆ ఇంటిని కూడా కూతురు పెళ్లికోసం విక్రయించి పెళ్లి చేశాడు. ఇది జరిగి ఇరవై ఏళ్లు గడుస్తోంది. ఆనాటి నుంచి నేటి వరకు ఎందరో ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు ఇంటి స్థలం, ఇల్లు కావాలని విన్నవించాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఎలాంటి ఆర్థిక సహాయాన్నీ ప్రభుత్వం నుంచి అందింది లేదు.
పేదలను విస్మరిస్తున్న కాంగ్రెస్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడాబాబులకు ప్రాధాన్యం పెరిగిపోయింది. ఉపాధి కోసం, ఉండేందుకు గూడు కోసం దరఖాస్తులు పెట్టుకుంటే వాటిని బుట్టదాఖలు చేస్తోంది. అదే పెద్దలడిగితే.. వారిని నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తూ... అడిగినన్ని వేల ఎకరాలను భూముల్నీ ధారాదత్తం చేస్తోంది. కానీ ఇలాంటి అభాగ్యులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది.
కులం పేదరికిని అథతం ఏ కుల అయిన దాని ఒక్కటే కాని అన్ని సామాజి వర్గల మధ్య రావటం సహజం ఈ రాజకీయ నాయులలకు ఓట్ల వచ్చి గడపగపకి మొకి వెళ్లిన్న వారి మళ్లీ ఓట్లప్పుడు గుర్తుం వస్తుతుంటారు. ఈ పేదరికని మచ్చే విధంగా ఎన్ని చట్టలు వచ్చిన్న ఈ వ్యవస్థలలో మార్పు రాదు.
No comments:
Post a Comment