Tuesday, January 11, 2011

టాలీవుడ్‌లో అడుగుపెట్టి నాశనం చేసి పారేశారని నిర్మాత : నట్టి కుమార్ ధ్వజo

బాలీవుడ్‌లో బాల్‌థాకరే వంటి నాయకులపై సినిమాలు తీసి అక్కడి ప్రేక్షకులకు బోర్ కొట్టించిన వర్మ ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టి నాశనం చేసి పారేశారని నిర్మాత నట్టి కుమార్ ధ్వజమెత్తారు. ఏ ముహూర్తాన రక్తచరిత్ర అంటూ సినిమా మొదలుపెట్టారో కానీ, ఆ సినిమాలతోపాటు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు.
ఫ్యాక్షన్ నాయకుడు మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత టాలీవుడ్‌లో ఎవరి పేరు ఏ రోజున వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని అన్నారు. ఏదో చిన్న సినిమాలతో హాయిగా ఉన్న పరిశ్రమను భారీబడ్జెట్‌లవైపు లాక్కెళ్లి నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్రాంతికి పండుగకు సినిమాలు విడుదలయ్యేందుకు థియేటర్లు లేవంటే పరిస్థితి ఎంత దాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా నిర్మాతలు భారీ బడ్జెట్ చిత్రాలంటూ వెంపార్లాట మాని తక్కువ బడ్జెట్లో సినిమాలు తీస్తే పరిశ్రమ పదికాలాల పాటు బతికి బట్టకడుతుందని నట్టి అన్నారు.

No comments:

Post a Comment