గోళ్లు పెంచుకునేవారు మనలో కూడా వుంటారు. కాకపోతే అవి రెండునెలలకో, ఆ తర్వాతో విరిగిపోతుంటాయి. అయినా సరే మళ్లీ పెంచడం మొదలెడతాం. ఇదిగో ఈ నఖ ప్రియుణ్ణి చూశారూ... పేరు లీ జియాన్‌పింగ్. 15 ఏళ్లగా తన ఎడమ చేతి గోళ్లు పెంచుతున్నాడు. ప్రస్తుతానికి వాటి పొడవు మీటరు పైమాటే.
దానికి చాలా కష్టపడాలంటే నమ్మండి. రాత్రి పూట ఎడమ చేతిని తల కింద పెట్టుకొని పడుకుంటాడు లీ. ఎందుకంటే నిద్రలో ఎటంటే అటు కదిలిస్తే...పొరపాటున గోళ్లు విరిగిపోతాయని భయం. వాస్తవానికి లీ పాతికేళ్ల కిందటే గోళ్లు పెంచనారంభించాడు. రెండు సార్లు విరిగిపోయాయి. సరేగానీ...అసలు లీకి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అనుకుంటున్నారా? ఓసారి ఒక భారతీయుడు ఇలా పొడవాటి గోళ్లు పెంచి రికార్డు సృష్టించినట్టుగా విన్నాడు లీ. అంతే తనూ ఆ పని చేయాలనుకున్నాడు. చేసేశాడు.

No comments:
Post a Comment