పేరులోనే ఉంది ఆనందం. అశేష తెలుగు ప్రేక్షకులకు ఆయన నవ్వులు పంచే హాస్యరాజు. ముఖకవళికలు, చేష్టలు, శరీరపు కదలికల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఆయనే బ్రహ్మానందం. నేడు ఆయన 50వ వసంతంలో అడుగిడారు. ఈ సందర్భంగా ఆయనకు హ్యాపీ బర్త్ డే విషెస్ చెపుదాం. ఇక ఆయన హాస్య నటన గురించి ఎంత చెప్పినా చర్వితచర్వణమే అవుతుంది. ఏ సన్నివేశాన్నైనా ఇట్టే పట్టేసి దాన్ని ఓ పట్టుపట్టి సీరియస్‌గా మూతి బిగించుకుని కూచునే వారు సైతం పెదవులను సాగదీసి నవ్వించేదాకా వదిలిపెట్టడు. అదీ ఆయన స్టామినా.
కొత్తగా ఎంతమంది కామెడీ నటులు వస్తున్నప్పటికీ ఆయన కామెడీ యాక్టర్స్‌లో హీరో. ఆయనకు కామెడీలు చేయడమే కాదు... భయంకరమైన రౌడీలా నటించడమూ తెలుసు. రౌడీ వేషం వేస్తే చూసి భయపడటం మాట అటుంచి అందరూ నవ్వుకోవాల్సిందే. తాజాగా ఆయన నటించిన కథ - స్క్రీన్ ప్లే- దర్శకత్వం: అప్పల్రాజు త్వరలో విడుదల కాబోతోంది.

No comments:
Post a Comment