
తొలిసినిమానే ప్లాప్‌నిచ్చిన దర్శకుడికి అదే హీరో మరోసారి అవకాశమివ్వాలంటే ఎన్నో గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న హీరో రవితేజ. ‘మిరపకాయ్’ ఆయనవల్లే సాధ్యమైంది. షాక్-అపజయం తర్వాత కూడా నన్ను నమ్మి అవకాశమిచ్చారాయన. తాజా విజయం నా కెరీర్‌లోనే మర్చిపోలేనిది’ అన్నారు యువదర్శకుడు హరీష్‌శంకర్. ఆయన దర్శకత్వంలో రవితేజ, రిచా గంగోపాథ్యాయ్, దీక్షాసేత్ నాయకానాయికలుగా రమేష్‌పుప్పాల నిర్మించిన సినిమా ‘మిరపకాయ్’ విజయోత్సవ కార్యక్రమంలో రవితేజ, రిచా గంగోపాథ్యాయ్, దీక్షాసేథ్, నిర్మాత రమేష్‌పుప్పాల, అలీ, బ్రహ్మాజీ, స్నిగ్ధ, తమన్, సాహితి, గౌతంరాజు, సునిల్, రామ్‌ప్రసాద్, దువ్వాసి మోహన్, బ్రహ్మ (ఆర్ట్ డైరెక్టర్), గిరి, ఫిష్ వెంకట్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

రవితేజ మాట్లాడుతూ ‘ఈ విజయం చాలా ఆనందాన్నిచ్చింది. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. సాంకేతికనిపుణుల కృషి, స్నిగ్ధ వాయిస్ ప్రశంసనీయం’ అన్నారు. రమేష్‌పుప్పాల మాట్లాడుతూ ‘సినిమా నాది..అన్నంతగా ప్రతి ఒక్కరూ కృషి చేశారు. అందుకే ఈ విజయం సాధ్యమైంది. నటీనటులు, సాంకేతికనిపుణులు, యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిర్మాతగా తొలి సినిమాతోనే విజయాన్నందుకోవడం మరువలేని ఆనందాన్నిస్తోంది’ అన్నారు.
No comments:
Post a Comment