Thursday, February 10, 2011

ఏం అందంరా బాబూ

టాలీవుడ్ హాట్ బేబీ దీక్షాసేథ్ మెల్లగా కోలీవుడ్‌లోనూ కాలు పెట్టింది. ఏకంగా విక్రమ్ సరసన ఛాన్స్ కొట్టేశానని సంబరంగా చెపుతోంది. అయితే విక్రమ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో మొదట అమలాపాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారట.
ఇంతలో ఏమైందో తెలియదు గానీ, హఠాత్తుగా చిత్ర దర్శకుడు దీక్షాసేథ్‌ని పిలిపించి ఫోటోసెషన్స్ పెట్టించాడట. ఆ ఫోటోల్లో దీక్షా అందాలు అదిరిపోవడంతో ఎంతమాత్రం ఆలస్యం చెయ్యకుండా విక్రమ్ సరసన నటించే ఛాన్స్ ఇస్తున్నట్లు దీక్షకు చెప్పాడట.

ఈ సంగతి తెలుసుకున్న హీరోయిన్ అమలాపాల్ నేరుగా వెళ్లి విక్రమ్ చెవిలో గుసగుసలాడిందట. దీంతో విక్రమ్ రంగంలోకి దిగినట్లు కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి విక్రమ్ సరసన తనకు ఛాన్సుచ్చిందోచ్ అంటూ ఎగిరెగిరి పడుతున్న దీక్షాసేథ్ ఆనందం అలాగే ఉంటుందో... లేదో చూడాలి.

No comments:

Post a Comment