Wednesday, February 9, 2011

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ క్వీన్ త్రిష.. అవునా...?!!

తెలుగు చలనచిత్ర రంగంలోకి మాఫియా ప్రవేశించిందనేది ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. గత నాలుగైదేళ్లుగా పరిశీలిస్తే కొన్ని సంఘటనలు ఇందుకు ఉదాహరణలుగా కన్పిస్తాయి. ఫైనాన్స్ వ్యవహారాల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవడం, హీరోయిన్లను ప్రముఖ రాజకీయ నాయకుల వద్దకు పంపించడం వంటి సంఘటనలు చాలా జరిగాయి. తాజాగా డ్రగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కొత్తేమీ కాదని సినీ విశ్లేషకులు అంటున్నారు. రవితేజ సోదరులు రఘుబాబు రాజు, భరత్ రాజులు గత ఏడాదిలో రెండుసార్లు పట్టుబడ్డారు. నానక్‌రామ్‌గూడ సినీవిలేజ్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో డ్రగ్‌తోపాటు మోడల్స్‌తో ఎంజాయ్ చేస్తుండగా సెప్టెంబరులో దాడి చేశారు. అయితే భరత్ రాజు తప్పించుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఆయన మళ్లీ వివాదంలోకి వచ్చారు.

అయితే ఈసారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ ఎలర్ట్ అయింది. నైజీరియా దేశస్తులు హైదరాబాదులో ఎక్కువగా ఉండటం విశేషం. ఉస్మానియా యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ కేంద్రాలు వారు తమ స్థావరాను ఏర్పరుచుకున్నారు. కొంతమంది విద్యార్థులుగా యూనివర్శిటీల్లో సీట్లు సంపాదించి కార్యకలాపాలను యధేచ్చగా సాగిస్తున్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు కూడా.

అయితే రెండురోజులనాడు పట్టుబడిన నైజీరియా దేశస్థుని ఫోన్ బుక్‌లో ఆశ్చర్యకరమైన పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం కమీషనర్ ఖాన్ దృష్టికి పలువురు పేర్లు వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రముఖ సినీ కథానాయిక త్రిష పలుమార్లు నైజీరియా దేశస్థునికి ఫోన్ చేసి మాదకద్రవ్యాలను తెప్పించుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది.

అదేవిధంగా మరో నాయిక సైరాభాను, ఆనంద్ ఫేమ్ రాజా, అష్టాచమ్మా హీరో నాని, రైడ్ నిర్మాత ఉప్పలపాటి శ్రీనివాస్, హీరో ఉదయ్‌కిరణ్‌తోపాటు అమాలాపురం ఎంపీ హర్షవర్థన్ కుమారుడు శ్రీరాజ్, తెలుగుదేశం నేత అరవింద్ కుమార్ గౌడ్ వినోద్ కుమార్ గౌడ్‌లున్నట్లు సమాచారం. అయితే ఓ ప్రముఖ ఛానల్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఫోన్ నెంబర్ల వివరాలను కూడా తెలిపింది. దాదాపు మూడువందలమంది ప్రముఖల పిల్లలు, పెద్దలు ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక దర్యాప్తు కింద రవీంద్ర అనే ఆరితేరిన పోలీసు అధికారి దీన్ని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలావుంటే మాదక ద్రవ్యాల కేసులో తన ఫోన్ నెంబర్ బయటకు రావడం పట్ల నాని సవాల్ విసిరారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగిన తనను ఎంతోమంది పబ్‌లకు ఆహ్వానించినా వెళ్లేవాడిని కాదనీ, అయినా తన నెంబరును ఇలా దుర్వినియోగం చేయడం విచారకరమని, పోలీసులు ఎటువంటి పరీక్షలు పెట్టినా సిద్ధమేనని శనివారం ఆయన సవాల్ విసిరారు.

ఇదిలావుండగా, ప్రముఖ హీరోలు, తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన మరో వర్థమాన హీరోతోపాటు బెంగాల్‌కు చెందిన నటి కమిలినీ ముఖర్జీ పేరు కూడా వినిపిస్తుండటం గమనార్హం. తరుణ్‌కి చెందిన పబ్‌లో వర్థమాన నటీనటులు ఇటువంటి కార్యకలాపాలకు వేదికగా మారింది. అయితే ఆ పబ్ పార్టనర్ మరొక వ్యక్తి కావడంతో తరుణ్ వెలుగులోకి రాలేదు. జూబ్లి హిల్స్‌లో గల ఆ పబ్‌లో ప్రముఖ దర్శకులు కూడా ఎంజాయ్ చేయడం విశేషం. ముమైత్ ఖాన్ అయితే తాను ఎంజాయ్ చేయడానికే ఇక్కడికి వస్తానని అప్పట్లో ప్రకటించింది. అది ఎటువంటి ఎంజాయ్‌మెంటో అనే దానిని మాత్రం మనకే వదిలేసింది.

No comments:

Post a Comment