
వాళ్లూ మనలాంటి వాళ్లే. కాస్త రంగు పూసుకుని లైట్లు వెలుతురు తగిలేసరికి మరింత మెరిసిపోతారంతే. సినిమాలో చూపించినంత అందంగా బయటేమీ ఉండరట. సినిమాల్లో కనిపించినంత సరదాగా బయటవాళ్లతో ఉండరు. సినిమాల్లో కనిపించినంత ఆదర్శవంతంగా బయట ఉండరు. తెగ గొప్పలు పోతారట...సినిమా తారల గురించి ఇండిస్టీ బయట ఉండే టాక్ ! అయితే ఈ విషయాలన్నీ తనకు సరిపడవని చెబుతోంది హాసిని జెనిలీయా.
'ఈ మాటలన్నీ కొందరి విషయంలో నిజం కావొచ్చేమో ! కానీ నా విషయంలో మాత్రం కాదు. నాకు లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరోకటి చెప్పడం చేత కాదు. మనసులో ఏమి ఉంటే పెదవి దాటి అదే వస్తుంది. నేను పెద్ద సినిమా తారననే గర్వం నాకు కొంచెం కూడా లేదు. సాదాసీదా జీవితం గడపటంలోనే ఆనందం కలుగుతుంది. నలుగురితోనూ కలిసిపోవటానికే ఇష్టపడతాను. కయ్యానికి కాలు దువ్వే తరహా మనస్తత్వం కాదు. చిన్నప్పటి నుంచి జట్టుగా ఏర్పడి ఆడే ఆటలంటే నాకు ఇష్టం. దానివలనే ఈ అలవాటు వచ్చింది' అని జెనీలియా చెబుతున్న సంగతి..!
No comments:
Post a Comment