భారత ఉపఖండంలో జరుగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. గత టోర్నీలో సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్ చేయాలన్న కోరిక నెరవేరలేదన్నాడు. కానీ ఈసారి భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్‌ను ఎదుర్కోవడంపైనే దృష్టిసారిస్తున్నానని అక్తర్ వ్యాఖ్యానించాడు. సచిన్‌ను పెవిలియన్‌కు పంపేందుకు భారత్‌తో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.
సచిన్ కొట్టే సిక్సర్లకు ఏమాత్రం భయపడేదిలేదని, అతనితో పాటు భారత టాప్ఆర్డర్‌ను కుప్పకూలుస్తానని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సవాల్ చేశాడు. ప్రతి బౌలర్‌కూ కష్టకాలం ఉంటుందని, ఆస్ట్రేలియా నెంబర్ వన్ బౌలర్ బ్రెట్ లీకి కూడా తప్పలేదని అక్తర్ గుర్తుచేశాడు.
కాగా భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టమైనదని, ఏమాత్రం అలసత్వం చూపినా మ్యాచ్ చేదాటిపోతుందని అక్తర్ అంగీకరించాడు. టీమిండియాలో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదని అభిప్రాయపడ్డాడు.

No comments:
Post a Comment