ఆ రెస్పాన్స్ చూసి రాత్రి హాయిగా నిద్రపోయా..!: ఛార్మి
"
మంగళ" సినిమా విడుదలకుముందు నిద్రపట్టలేదు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే టెన్షన్ ఉండేది. ప్రివ్యూ చూసినవారంతా బాగుందన్నారు. కానీ అసలైన తీర్పు ప్రేక్షకులు ఇవ్వాలి. అందుకే సినిమాను హైదరాబాద్‌లో థియేటర్‌లో చూశాను. కథను ఉత్కంఠంగా తీసిన దర్శకుడు తులసీరామ్‌ను మెచ్చుకుంటూనే.. నా పాత్ర వచ్చేసరికి చాలా టెన్షన్‌గా కూర్చుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఆ సన్నివేశాల్లో కన్పించింది.ఆ తర్వాత సాధువులు వచ్చే సన్నివేశంలో క్లాప్స్ పడ్డాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక హాయిగా నిద్రపట్టింది అని చార్మి అంది. ఈ సినిమాలో 'చకోచి' పాత్ర చేయడం అదృష్టంగా భావించాను. సినిమా చూశాక మగ్గురు హీరోయిన్లు ఫోన్లు చేశారు. మంచి పాత్ర వచ్చింది. యు ఆర్ లక్కీ అంటూ కితాబిచ్చారని ఛార్మింగ్ గర్ల్ ఛార్మి చెప్పింది. 2వతేదీన విడుదలైన "మంగళ" సినిమా మంచి సక్సెస్‌సాధించిందని దర్శకుడు తులసీరామ్ చెప్పారు.
No comments:
Post a Comment