Sunday, March 6, 2011

సఫారీలపై ఆరు పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్!

చెన్నై చేపాక్కం స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 21వ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆరు పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైన్ల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 
 అయితే విజయం వైపు దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా ఒక్కసారిగా ఒత్తిడికిలోనై కష్టాల్ని కొనితెచ్చుకుంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 172 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 47.4 ఓవర్లలో 165 పరుగులకే పదివికెట్లు కోల్పోయింది. ఓ దశలో 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులతో నిలకడగా రాణిస్తోన్న దక్షిణాఫ్రికా జట్టు వెంటవెంటనే ప్లెసిస్, డ్యూమినీ, పీటర్సన్‌ల వికెట్లు కోల్పోయింది.

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ ఆమ్లా (42) మినహా ఏ ఒక్కరూ ధీటుగా రాణించలేకపోయారు. 51 బంతులాడిన ఆమ్లా రెండు ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో స్మిత్ (22), కల్లీస్ (15), డివిలియర్స్ (25), ప్లెస్సిస్ (17), స్టెయిన్ (20), విక్ (13)లు రెండంకెల స్కోరు చేయడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరునైనా సాధించగలిగింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ నాలుగు వికెట్లు సాధించగా, ఆండర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. యార్డి, బ్రెస్నాన్, స్వాన్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 45.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది.

ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో ట్రాట్ (52), రవి బోపరా (60)లు అర్థసెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో విజృంభించిన తహీర్ నాలుగు వికెట్లు సాధించగా, పీటర్సన్ మూడు, మోర్కెల్ రెండు, స్టెయిన్ ఒక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

No comments:

Post a Comment