Sunday, March 20, 2011

ఆమె కళ్లు చాలా సెక్సీ...



ఇదీ సంగతి. టాలీవుడ్ ఆజానుబాహుడు రానా "లీడర్" తర్వాత నేరుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. "దమ్మరో దమ్" చిత్రంలో అభిషేక్ బచ్చన్, ప్రతీక్ బబ్బర్, బిపాసాలతో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చేసే సమయంలో బిపాసాబసు రానాను చూస్తే తెగ ఇదైపోయేదట.

రానాతో ఒక్కసారే కాదు మళ్లీమళ్లీ నటించాలనుందని తన మనసులోని కోరికను బయట పెట్టేసిందట. అంతగా కలిసిపోయే సహనటుడ్ని ఇంతవరకూ తన కెరీర్లో చూళ్లేదని తెగ పొగడ్తలు కురిపిస్తోందట. ఇక రానా విషయానికి వస్తే... బిపాసతో నటించడం చాలా ఎంజాయ్‌మెంట్‌గా ఉంటుందనీ అంటున్నాడట. ఆమె తన కళ్లతోనే హావభావాలు పలికిస్తుందనీ, ఆ కళ్లు సెక్సీగా ఉంటాయని కితాబిస్తున్నాడట. మొత్తానికి రానాకు బాలీవుడ్ సినిమా నీళ్లు బాగా పడినట్లున్నాయ్. అక్కడి సూపర్ స్టార్స్‌ను వెనక్కి నెట్టేసి నెంబర్ 1 స్థానంలోకి వచ్చేస్తాడేమో... చూద్దాం.

No comments:

Post a Comment