ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే జగన్ పార్టీ వచ్చేదే కాదని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. పదవులు ఆశించి వచ్చే పార్టీలకు మనుగడ ఉండదన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విషయంలో ప్రజలు దీన్నే స్పష్టం చేశారన్నారు. చిరంజీవి పరిస్థితే జగన్‌కూ వస్తుందన్నారు. ఆయన పార్టీకి వైఎస్సార్ అవినీతి కాంగ్రెస్ అని పేరు పెడితే సరిగా సరిపోయేదన్నారు. అవినీతికి ఈ రాష్ట్రంలో వైఎస్సే స్ఫూర్తి అన్నారు. అవినీతి డబ్బుతో చేసే రాజకీయాలు తాత్కాలికమన్నారు. జగన్ కాంగ్రెస్ తానులో భాగమేనని ఆయన అన్నారు.
No comments:
Post a Comment