సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి తన సొంత జిల్లా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోయారని వైఎస్‌ఆర్ పార్టీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంత్రులు డబ్బులు ఎరచూపినాసరే జగన్ దాడికి తట్టుకోలేకపోయారని విమర్శిచారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకే దారిలో నడిచినాసరే జగన్ అభ్యర్థులను ఓడించలేకపోయారంటే, జగన్‌కు ఉన్న ప్రజాబలం ఏమిటో అర్థమైపోయిందన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన మంచి పనులనులే జగన్‌ను మెజార్టీ తెలపిస్తుందన్నారు. డబ్బు కాన్నా వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే ప్రజాబలం వుందని స్థానిక సంస్థల ఎమెల్సీ ఎన్నికలు ద్వారా తెలిపిందన్నారు. రాబోరోజుల్లో కాంగ్రెస్ పార్టీ జగన్ దెబ్బకు కూలిపోతుందని, అలాగే టిడిపి పేరు కూడా మాయమైపోతుందని అంబటి రాంబాబు తెలిపారు.
No comments:
Post a Comment