Thursday, March 24, 2011

ప్రపంచానికి సెక్స్ సింబల్.. బాలీవుడ్‌కు విలన్!

కత్రినా కైఫ్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ. బాలీవుడ్ అందగత్తెల్లో ఒకరుగా గుర్తింపు పొందింది. బాలీవుడ్ హీరో‌ సల్మాన్ ఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని పబ్లిక్‌గ్గానే తిరిగింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. కానీ, ప్రపంచానికి మాత్రం ఓ సెక్స్ సింబల్‌గా ఖ్యాతిగడించింది.

ఆమె గతంలో నటించిన బాడీగార్డ్ చిత్రంలో సల్మాన్ సరసన నటించమంటే కుదరంటే కుదరదని తెగేసి చెప్పిన ఈ భామకు తాజాగా యష్‌రాజ్ ఫిలిమ్ ప్రొడక్షన్ ఆఫీసు నుంచి సల్మాన్ సరసన ఆఫర్ వచ్చింది. దాంతో కత్రినా పిచ్చిపిచ్చిగా అరిచి గోల చేసినంత పని చేసింది.

సల్మాన్ పేరు తన వద్ద తేవద్దు అంటే, ఎందుకు మాటిమాటికీ అతని పేరు నాకు వినిపించేలా మాట్లాడుతున్నారని యాగీ చేసింది. ఒక్కసారి నేను వద్దూ అంటే అది వందసార్లు చెప్పినట్టేనంది. 
సల్మాన్‌ను హీరోగా తను హీరోయిన్‌గా ఏ చిత్రం ఇహ చేయనని, ఇలాంటి ఆఫర్‌తో తన వద్దకు రావద్దని చెప్పింది. మొత్తానికి గట్టి పట్టే పట్టింది కత్రినా. దీంతో ఇపుడామె బాలీవుడ్ నిర్మాతలకు విలన్‌లా కనబడుతోందట.

అయినా పేరు చెప్పినంత మాత్రానికే అంత జంకెందుకో...? మళ్లీ పాతరోజులు బ్లాక్ వైట్ లో రింగులు రింగులుగా గుర్తుకొస్తాయనే భయమా..? లేక కొత్త బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్ "ఛీ ఇంకా పాతప్రియుడి ఆలోచనల్లోనే ఉన్నావా" అంటాడనా...?

No comments:

Post a Comment