Wednesday, March 23, 2011

జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా "శక్తి" వాయిదా

జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా నటించిన 'శక్తి' చిత్రం ఈనెల 30న విడుదల కావాల్సి ఉంది. బుధవారం నాటికి ఇంకా ప్రసాద్‌ ల్యాబ్స్‌తో పాటు ముంబైలో పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌ మిగిలి ఉన్నట్లు సమాచారం. దీంతో చిత్రం విడుదల వాయిదా పడవచ్చని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.
ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా... దాదాపు వాయిదా ఖాయమనే తెలిసింది. ఏప్రిల్‌ 8వ తేదీన విడుదల చేయడానికి నిర్మాత సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెహర్‌ రమేష్‌ అద్భుతంగా తెరకెక్కించానంటున్న ఈ చిత్ర ఆడియో కాస్త వీక్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు సన్నగిల్లాయి.

ఏదేమైనా ఎన్‌.టి.ఆర్‌. చిత్రమంటే ఓపెనింగ్స్‌ విపరీతంగా వస్తాయి కనుక ఎలా మార్కెట్‌ చేసుకోవాలోనన్న దానిపై సి.అశ్వనీదత్‌ దృష్టి సారించినట్లు సమాచారం.

No comments:

Post a Comment