Monday, March 28, 2011

పవన్ కళ్యాణ్.. రేణూ దేశాయ్‌ల మధ్య ఎడబాటు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి రేణూ దేశాయ్‌ల దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చినట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య అంతరం బాగా పెరిగినట్టు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఏర్పడిన చిన్నపాటి విభేదాలు ముదిరి పాకాన పడి తెగతెంపుల చేసుకునే స్థాయికి చేరుకున్నట్టు సమాచారం. ఈ పుకార్లను ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా కొట్టివేయడం లేదు. దీంతో వారిద్దరు విడిపోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.

ఇందుకోసం భరణం కింద ఆరు కోట్ల రూపాయలను రేణూ దేశాయ్‌కు పవన్ కళ్యాణ్ చెల్లించినట్టు తెలుస్తోంది. అలాగే, పిల్లల బాధ్యతను కూడా తానే చూసుకుంటానని పవన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం రేణూ దేశాయ్ తన పుట్టినిల్లు పూణెలో ఉన్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment