Friday, March 4, 2011

త్రిష - ఇష - నిష

ishalu
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో జయ అనే పేరుకు చాలా గిరాకీ ఉండేది. జయప్రద, జయసుధ, జయచిత్ర వంటి హీరోయిన్లు జయకేతనం ఎగుర వేయడమే అందుకు కారణం. ఆ తర్వాత కొంతకాలం ‘ర’ అక్షరం రాజ్యమేలింది.
రాధ, రమ్యకృష్ణ, రంభ వంటివారు ఈ రంగంలో రాణించారు. ఇప్పుడు పేరు చివర ‘ష’ అనే అక్షరం కలిగి ఉండడం అదృష్టంగా మారింది. త్రిష, నిష, ఇష వంటి హీరోయిన్స్‌ అందుకు మంచి ఉదాహరణ. త్రిష గత ఏడెనిమిదేళ్లుగా తమిళంతోపాటు, తెలుగు తెరను పరిపాలిస్తుండగా, పరిపాలనా పగ్గాలను త్రిష నుంచి లాక్కోవడానికి నిష, ఇషలు ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌కు స్వయాన సోదరి అయిన నిషా అగర్వాల్‌.. ‘ఏమైంది ఈవేళ’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమై, తాజాగా ‘సోలో’ హీరోయిన్‌గా నారా రోహిత్‌ సరసన నటిస్తుండగా, ఇష ‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతానికి ఇషకు ఇంకా రెండో అవకాశం రాకున్నప్పటికీ.. ఆ అవకాశం ఇచ్చేందుకు పలువురు దర్శకులు, నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారని సమాచారం అందుతోంది!

No comments:

Post a Comment