పవన్‌కళ్యాణ్-త్రిష జంటగా జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్‌స పతాకంపై గణేష్‌బాబు నిర్మిస్తున్న ‘తీన్‌మార్’ పాటలు ఈనెల రెండోవారంలో విడుదల కానున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ‘భూలోక స్వర్గం కాశీలో భారీసెట్స్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. మహాశివునిపై అద్భుతమైన పాటని మణిశర్మ అందించారు. ఇంద్ర చిత్రంలోని ‘భం భం బోలే...’ పాటకు సరితూగేలా ఉంటుంది. పవన్ ఫ్యాన్స్‌తో తీన్‌మార్ వేయించే ప్రత్యేక గీతమిది. పవన్ నటన, త్రిష అందం, త్రివిక్రమ్ మాటలు, మణిశర్మ సంగీతం, జయంత్ టేకింగ్ ప్రధాన అస్సెట్స్. వీటికి జతగా అద్భుత నిర్మాణ విలువలు సినిమాని టాప్‌హిట్‌గా నిలుపుతాయి. ఈ నెల రెండోవారంలో పాటలు, వేసవి కానుకగా సినిమా విడుదల చేయనున్నాం. మహాశివరాత్రి రోజు ఈ విషయాన్ని తెలుపడం ఆనందాన్నిస్తోంది’ అన్నారు. మహిళలు, యువత సహా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే ఈ చిత్రానికి సహనిర్మాత: బడే రవికిరణ్, సమర్పణ: శివబాబు.
దీపిక ఐటమ్ లేదు!
‘తీన్‌మార్’లో దీపిక పదుకొనె ఐటం సాంగ్‌లో నర్తిస్తోంది అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా నిర్మాత గణేష్‌బాబు ఖండించారు. జయంత్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రం ‘లవ్ ఫర్ ఎవర్’లో దీపిక ఐటం సాంగ్ చేసి ఉండడంతో.. ఈ పాట ‘తీన్‌మార్’ చిత్రం కోసమే అయ్యుంటుందని ఉత్తరాది మీడియా చేసిన ఊహాగానం దక్షిణాదికీ పాకి.. కొంత గందరగోళానికి దారి తీసింది.
No comments:
Post a Comment