Saturday, May 7, 2011

రానా- జెనీలియా కాంబినేషన్లో "నా ఇష్టం"

దగ్గుబాటి రానా, జెనీలియా హీరో హీరోయిన్లుగా యునైటెడ్‌ మూవీస్‌ 'నా ఇష్టం' షూటింగ్‌ ప్రారంభోత్సవం బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించిన 'సింహా'వంటి పవర్‌ఫుల్‌, సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని నిర్మించిన ప్రతిష్టాత్మక యునైటెడ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ప్రకాష్‌ తోలేటిని దర్శకునిగా పరిచయం చేస్తూ దగ్గుబాటి రానా హీరోగా, జెనీలియా హీరోయిన్‌గా యువ నిర్మాత పరుచూరి కిరీటి నిర్మిస్తున్న 'నా ఇష్టం' చిత్రం షూటింగ్‌ ప్రారంభోత్సవం నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోస్‌లో అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగింది.హీరో దగ్గుబాటి రానాపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్‌నివ్వగా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు సుకుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. తొలుత స్క్రిప్ట్‌ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్న ప్రకాష్‌ తోలేటికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, మూవీమొఘల్‌ డా|| డి. రామానాయుడు అందజేశారు.

ఫీల్‌గుడ్‌ యూత్‌ఫుల్‌ మూవీగా రూపొందుతున్న 'నా ఇష్టం' చిత్రం రానా సినీ కెరీర్‌లో ఓ చక్కటి చిత్రంగా నిలుస్తుందని చిత్రనిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు. మే 6 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి మూడు షెడ్యూల్స్‌లో చిత్రం పూర్తి చేస్తామని కిరీటి చెప్పారు. ప్రతిష్టాత్మక సంస్ధ యునైటెడ్‌ మూవీస్‌ బ్యానర్‌లో 'నా ఇష్టం' చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుందని చిత్ర దర్శకులు ప్రకాష్‌ తోలేటి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రామ్‌, ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. రానా, జెనీలియా, బ్రహ్మానందం, హర్షవర్ధన్‌, నాజర్‌, రఘుబాబు, ఆహుతిప్రసాద్‌, ఆలీ, అజయ్‌, భరత్‌, ఉత్తేజ్‌, చిత్రం శ్రీను, శ్రీనివాసరెడ్డి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, ఫృధ్వి, జోగి బ్రదర్స్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సినిమాటోగ్రఫి: వెంకట్‌ప్రసాద్‌, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, రచన: కోన వెంకట్‌, రచనా సహకారం: చంద్రశేఖర్‌ టి. రమేష్‌, వేమారెడ్డి, శ్రీకర్‌, కో డైరెక్టర్‌: తిరుమల కుమార్‌, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌: శ్రీకర్‌, ప్రసాద్‌, రామకృష్ణ, శ్రీధర్‌, శశిధర్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: జి.గోపాలకృష్ణ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: మోహన్‌ పరుచూరి, నాగు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: మణికంఠ, పిఆర్‌ఓ: రాఘవేంద్రరెడ్డి. నిర్మాత: పరుచూరి కిరీటి, కథ-మాటలు - స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: ప్రకాష్‌ తోలేటి

No comments:

Post a Comment