నాకు "వీర" లాంటి మగాడు కావాలి: కాజల్
ఇది నిజమా! అంటూ నటి కాజల్ అగర్వాల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. "ట్విట్టర్లో ఈ మధ్య రాస్తున్నట్లున్నారు. మీరేనా రాస్తోంది. టైమ్ కుదురుతుందా?" అనే ప్రశ్నకు. ఆపై మాట్లాడుతూ... "నాకు అసలు ట్విట్టర్ ఖాతానే లేదు. కనీసం ఫేస్‌బుక్ కూడా లేదు. ఓన్లీ ఈమెయిల్స్ ఉపయోగించుకుంటాను" అని చెప్పింది. కొన్ని వెబ్‌సైట్లు.. మీకు ప్రముఖ హీరోకు ప్రేమ నడుస్తోందనీ, త్వరలో పెండ్లి చేసుకుంటారని రాస్తున్నారని అడిగితే... "ఇది నిజమా... నా గురించి అలా రాస్తున్నారా. నేను ఎవరినీ ప్రేమించలేదు. ఏదైనా వుంటే ముందుగా మీడియాకే చెబుతా"నని సెలవిచ్చింది.
ఎటువంటి వ్యక్తిని భర్తగా కోరుకుంటారని అడిగితే.. 'వీర' చిత్రంలో రవితేజలా చక్కగా చూసుకుంటూ సరదాగా ఉండేవాడు దొరికితే బాగుండు అని చెప్పింది. హీరోయిన్‌వి కూడా సినీ కలలేనన్నమాట.
No comments:
Post a Comment