Monday, May 2, 2011

"షాడో" టైటిల్ కాదు వర్కింగ్ టైటిల్ మాత్రమే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "షాడో" చిత్ర షూటింగ్ ఈనెల ఆరో తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌తో తొలి తెలుగు చిత్రాన్ని తాను చేయనున్నట్టు దర్శకుడు చెప్పాడు. ఈ చిత్రం టైటిల్‌పై పలు రకాల ఊహాగానాలు వస్తున్నాయన్నారు. వాస్తవానికి ఈ చిత్రం టైటిల్ షాడో కాదని, ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని చెప్పారు. కాగా, ఈ చిత్రాన్ని ఆర్ కామ్ మీడియా, సంఘమిత్ర ఆర్ట్స్‌లు సంయుక్తంగా నిర్మాతలు యార్లగడ్డ శోభ, నీలిమలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సార్ జాన్‌డైస్, అంజలి లావణ్యలు హీరోయిన్లుగా నటిస్తుండగా, జాకీష్రాఫ్, అతుల్ కులకర్ణి, తనికెళ్ల భరణి, అడవి శేషులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతబాణీలను సమకూర్చనున్నారు.

No comments:

Post a Comment