Monday, May 2, 2011

తెల్లపిల్ల తాప్సీ వర్సెస్ "మగధీర" కాజల్ అగర్వాల్..!



కాజల్ అగర్వాల్ తెల్లపిల్ల తాప్సీ పేరు చెబితే మండిపడుతోందట. కారణం ఏంటయా అని ఆరా తీస్తే.. ఇటీవల కాలంలో వీళ్లద్దరూ కలిసి ఒకే హీరోతో జతగా నటించడం అనుకోకుండా జరుగుతూ ఉంది.

ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన "మిస్టర్ పర్ఫెక్ట్" చిత్రంలో ఈ ఇద్దరు భామలు నటించారు. ఈ చిత్రంలో తాప్సీ గ్లామర్ అందాలను ఒలకబోస్తే కాజల్ అగర్వాల్ తన అందాలను చూపించే ఛాన్స్ రాలేదు. దాంతో కాస్తంత నిరాశ చెందినట్లు భోగట్టా. తాజాగా రవితేజ హీరోగా మరోసారి ఈ ఇద్దరు భామలు హీరోయిన్లుగా వీర చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ కాజల్ అగర్వాల్ పాత్ర సంప్రదాయబద్ధమైన లంగా ఓణీ పాత్రేనట. మరోవైపు తాప్సీ స్కిన్ షోతో కాజల్‌ను డామినేట్ చేసేటట్లుగా కనిపిస్తోందట.

ఇలాగే కొనసాగితే నీ ఫేమ్ ఫేడైపోతుందని కాజల్ అగర్వాల్ సన్నిహితులు ఆమె చెవిలో జోరీగలా రొద పెడుతున్నారట. దీంతో ఉండబట్టలేని కాజల్, తనకు కూడా గ్లామర్ అందాలను ప్రదర్శించే ఛాన్స్ కల్పించాలని వీర చిత్రం డైరెక్టర్‌కు కండిషన్ పెట్టిందట.

ఎంత మార్పు..? ఇదివరకూ అందాలను చూపించకుండా నటనతోనే ఆకట్టుకోవాలని యత్నించేవారు. ఇపుడు అందాల ఆరబోతలో నువ్వా..? నేనా..? అనే రీతిలో తలపడుతున్నారు.

No comments:

Post a Comment