Thursday, June 9, 2011

కత్తి లాంటి శృంగార దేవత కత్రినాయే: ఎఫ్‌హెచ్ఎం

ప్రపంచ శృంగార దేవతగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ మరోమారు ఎంపికయ్యారు. ఈ ముద్దుగుమ్మకు మించిన మరొక సెక్సీయెస్ట్ అందగత్తే ఈ భూలోకంపై లేదని ఈ ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్ నిర్వహించిన సర్వే తేల్చింది. ఈ సర్వేలో పాల్గొన్న వారంతా మత్తెక్కించే కైఫ్‌కే తన ఓటు వేసి అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సర్వేను ఆన్‌లైన్, ఎస్ఎంఎస్‌ల ద్వారా నిర్వహించారు. ఈ పోల్‌లో 35 వేల మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. పదిహేడేళ్లుగా తాము ఈ పోల్ నిర్వహిస్తున్నామని, తమ పోల్‌లో మూడుసార్లు మొదటి స్థానంలో నిలిచి కత్రినా రికార్డు నెలకొల్పారని ఎఫ్‌హెచ్ఎం ఎడిటర్ కబీర్ శర్మ తెలిపారు.

2008, 2009లతోపాటు ఈ ఏడాది కూడా ప్రపంచ శృంగార మహిళగా కత్రినాయే ఎన్నికైందని గుర్తు చేసిన ఆయన 2010లో మాత్రం దీపికా పదుకొనే ఎన్నికైనట్టు ఆయన వివరించారు. మొత్తం మీద వయస్సు మీదపడుతున్న కత్రికా కైఫ్ అందాలు మాత్రం మరింత ఆకర్షణీయంగా మారుతుండటం గమనార్హం.

No comments:

Post a Comment