పాప్ సంగీత రారాజు మరణించి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి అయింది. 2009 జూన్ 25న గుండె పోటుతో జాక్సన్ మరణించారు. కాగా ఆయన మృతిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ మిస్టరీకి తెరపడలేదు. మెకైల్ జీవితంలో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను పాప్ సంగీతంతో ఉర్రూతలూగించాడు. పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ పాటలను ఇష్టపడని సంగీత ప్రేమికులు ఉండరు. పలు సూపర్‌హిట్ ఆల్బమ్స్‌తో ఈ సెలబ్రిటీ సింగర్ పాప్ ప్రపంచంలో తనకం టూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.చిన్నతనంలో పేదరికాన్ని ఎదుర్కొన్న ఈ పాప్ సెలబ్రిటీ నెవర్‌ల్యాండ్ ఎస్టేట్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. అయితే అనేక వివాదాల కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన జాక్సన్ చివరికి తన ఎస్టేట్‌ను అమ్ముకోవాల్సివచ్చింది. జాక్సన్ మరణానంతరం ఆయన ఎంతగానో ప్రేమించి, నివసించిన నెవెర్‌ల్యాండ్ ఎస్టేట్‌ను తిరిగి కొనుగోలు చేయాలని నేడు ఆయన పిల్లలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పాప్ కింగ్‌గా సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మైకెల్ జాక్సన్ ఆత్మ శాంతించాలని ఆయన వర్ధంతి సందర్భంగా మనమందరం ఆశిద్దాం.
No comments:
Post a Comment