Saturday, June 25, 2011

ఐటమ్ సాంగ్‌ చిత్రీకరణలో నాగచైతన్య, కాజల్‌ల "దడ"

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా శ్రీ కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై అజయ్ భూమన్ దర్శకత్వంలో శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "దడ". ఈ చిత్రానికి ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జూన్ 26న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల యూరప్‌లో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. బ్యాలెన్స్ వున్న ఒక్క ఐటమ్ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ ఆదివారం నుంచి జరుగుతుంది. నాగచైతన్య, బ్రిటీష్ టాప్ మోడల్, బాలీవుడ్ హీరోయిన్ అరుణ షీల్డ్స్‌తో ఈ సాంగ్ చేస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భార్ సెట్స్‌లో ప్రేమ్‌రక్షిత్ నృత్య దర్శకత్లంలో చిత్రీకరించే ఈ పాటతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. జూలైలో ఆడియో రిలీజ్ చేసి ఆగస్ట్ రెండో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

అక్కినేని నాగచైతన్య, కాజల్ అగర్వాల్, శ్రీరామ్, సమీక్ష, బ్రహ్మానందం, ఆలీ, రాహుల్ దేవ్, ముఖేష్ రిషి, కెల్లీ డార్జ్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: అజయ్ మాకెన్, శివ్ సింగ్, డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జ్ఞానశేఖర్, వి.ఎస్., సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, మాటలు: అబ్బూరి రవి, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, కో-ప్రొడ్యూసర్: డి.విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: శివప్రసాద్ రెడ్డి, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం : అజయ్ భుయాన్.

No comments:

Post a Comment