దక్షిణ భారత సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయడం లేదని, అసలు అలాంటి వైద్యం అవసరమే లేదని జాతీయ అవార్డు విన్నర్, రజనీ అల్లుడు ధనుష్ చెప్పుకొచ్చాడు. అనారోగ్యం పాలైన రజనీకాంత్ గత కొన్ని రోజులుగా సింగపూర్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో తమ అభిమాన హీరో ఆరోగ్య పరిస్థితిపై కోట్లాది మంది అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రజనీకి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నట్టు వస్తున్న వార్తలు వారిని మరింతగా కుంగదీశాయి. దీనిపై అల్లుడు ధనుష్ స్పందించారు. సూపర్‌స్టార్ ఆరోగ్యం సూపర్‌గా ఉందన్నారు. పది రోజుల్లో చెన్నయ్‌కు తిరిగి రాకుంటే ఆయన వేసవి విడిదిని మరింత ఎంజాయ్ చేస్తున్నట్టుగా భావించాలన్నారు. అంతేకాకుండా, తమ మామగారికి ఎలాంటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయడం లేదన్నారు. ఈ అంశంపైనే రజనీకాంత్ త్వరలోనే స్వయంగా ఒక ప్రకటన చేస్తారని చెప్పారు.
ప్రస్తుతం ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. అందుకే మరో వారం రోజుల పాటు సింగపూర్‌లోనే ఉండాల్సిందిగా కోరుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆయన సాధారణ ఆహారపు అలవాట్లనే పాటిస్తున్నట్టు చెప్పారు. ఎంతో ఉల్లాసంగా ఉంటూ నడుస్తూ, నిద్రిస్తూ, సినిమాలు చూస్తూ, ధ్యానం చేస్తూ టైమ్‌పాస్ చేస్తున్నట్టు తెలిపారు.

No comments:
Post a Comment