Wednesday, August 17, 2011

పుస్తకాలతో కుస్తీ పడుతున్న హాన్సిక!

"కందిరీగ" చిన్నది హాన్సిక పుస్తకాలతో కుస్తీ పడుతోంది. ఇందుకోసం ఆమె న్యూయార్క్‌కు వెళ్లింది. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేస్తోంది. ఇందుకోసం పది రోజుల పాటు న్యూయార్క్‌లో ఉండేందుకు వెళ్ళింది. అక్కడ ప్రస్తుతం హన్సికకు పరీక్షలు ఉన్నాయట. అందుకే పాపం ఈ పాప పుస్తకాలతో కుస్తీపడుతోందట. ఇప్పుడు నేను ప్రేక్షకులకు, సినిమా పరిశ్రమకు ఎంతో దూరంగా ఉన్నాను. ఇక్కడ కెమెరాలు లేవు. యాక్షన్ లేదు. మరో పది రోజులు ఇక్కడే వుంటాను.

ఆ తర్వాత నేను నటించే కొత్త తమిళ సినిమా "వేలాయుధం" ఆడియో విడుదల మదురైలో జరుగబోతోంది. దానికి హాజరవుతాను అని చెపుతోంది. అయితే, ఇటీవల విడుదలైన కందిరీగ చిత్రంపై ఈ పాలబుగ్గల చిన్నది స్పందిస్తూ.. చిత్రంపై మంచి టాక్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

No comments:

Post a Comment