Saturday, September 17, 2011

వరుణ్ సందేశ్‌ను ఒక్కటంటే ఒక్కసారే కలిశా: అస్మిత

అస్మితా సూద్‌.. ఈ పేరువినగానే.. సోనూసూద్‌ రిలేషన్‌ అని మొదట అనుకున్నారు. కానీ సోనూసూద్‌ తనకు సోనూసూద్ ఎవరో తెలియదని చెప్పాడు. దాంతో డౌట్ క్లియర్ అయిందనుకోండి................... ఐతే ఈ అస్మితా సూద్, వరుణ్‌ సందేశ్‌తో కలిసి 'బ్రహ్మిగాడి కథ' చిత్రంలో నటించింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ కుదిరిందని పుకార్లు వచ్చాయి. షూటింగ్‌లో బాగా క్లోజ్‌గా ఉండేవారట. అదే టైమ్‌లో వరుణ్‌సందేశ్‌ డ్రగ్‌ కేసులో ఉన్నాడని వార్తలు రావడంతో అస్మితా సూద్ తన సిమ్ కార్డ్ మార్చేసిందట. ఎందుకంటే వరుణ్ తో మాట్లాడినా అదో తలనొప్పిగా తయారవుతుంది కనుక అలా చేసిందట.

అస్మితకు ముందే వరుణ్ సందేశ్‌కు శ్రద్దాదాస్‌తో ఎఫైర్‌ ఉందని ఫిలింనగర్‌ జనాలు ఎక్కడ కలిసినా చెవులు కొరుక్కునేవారు. ఇదే విషయపై అస్మితాను అడిగితే.. వరుణ్‌కు, శ్రద్దాదాస్‌ ఎఫైర్‌ విషయం నాకు తెలీదు. వారి మధ్య గొడవలు నాకు తెలీదు. నేను మాత్రం ఒకే ఒక్కసారి ఓ పార్టీలో వరుణ్ సందేశ్‌ను కలిశానంది. అది చాలదా... అండర్‌స్టాండింగ్ కుదరడానికి అంటున్నారు టాలీవుడ్ జనం.

No comments:

Post a Comment