చరణ్‌కు సోనా డెడ్‌లైన్: క్షమాపణ చెప్పకపోతే ఇంటెదురే టెంట్
ఇపుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వ్యాంప్ ఆర్టిస్ట్ సోనా పేరే వినబడుతోంది. తనపై ఎస్పీ బాలు కుమారుడు చరణ్ అత్యాచార యత్నం చేశాడనీ, తన సున్నితమైన భాగాలపై చేతులు వేసి ఇబ్బంది పెట్టాడంటూ సోనా కేసు పెట్టిన సంగతి తెలిసిందే.............................అంతేకాదు తనపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు బహిరంగ క్షమాపణకు చరణ్ ముందు 10 రోజుల డెడ్‌లైన్ పెట్టింది. ఆ డెడ్‌లైన్ ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోనుంది. కానీ చరణ్ మాత్రం స్పందించడం లేదు. పైపెచ్చు, ఆమెకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం వల్లనే తనపై ఇలా దుష్ర్పచారం చేస్తోందని విమర్శించాడు. దీంతో సోనా తన పట్ల చరణ్ ఆ రోజు రాత్రి ఎలా ప్రవర్తించిన తాలూకు వీడియోను పోలీసులకు అందజేసింది.
తనకు క్షమాపణ చెప్పకపోతే చరణ్ ఇంటిముందు టెంట్ వేసి ధర్నాకు దిగుతానని హెచ్చరికలు సైతం చేస్తోంది. సోనాకు మద్దతుగా తమిళనాడులో పలు మహిళా సంఘాలు నిలిచాయి. ఆమెకు సపోర్టుగా ఝాన్సీరాణి మహిళా శిశు సంస్థ నిలిచింది. చరణ్ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని వారంతా పట్టుబడుతున్నాయి.
No comments:
Post a Comment