![]() |
సినిమాలు సమాజానికి మంచి చేయాలి, చెడు చేయడం చాలా ఈజీనే. అయితే ఈ విషయంలో దర్శకుడు కృష్ణవంశీ మాత్రం తాను చెడుచేయడం లేదనీ, ప్రజలే అలా కోరుకుంటున్నారని అంటున్నాడు.................ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం 'మొగుడు' భార్య భర్తలు పెండ్లి తర్వాత ఎలా ఉండాలి? అంతకుముందు ఎలా ఉండేవారు..? అనేది ఇందులో చర్చించారు. ఈ చిత్రం నవంబర్ 4న విడుదలకాబోతుంది. ఐతే ఆయన చిత్రం గురించి చెబుతూ... దేశభక్తితో పాటు మీరు అశ్లీలం బాగా చూపిస్తున్నారని ప్రశ్నిస్తే... దేశభక్తి అనేది అందరికీ ఉంటుంది. దాన్ని నాకు నచ్చిన శైలిలో చిత్రిస్తున్నాను అన్నారు.
హీరోయిన్లను అశ్లీలంగా ఎప్పుడూ చిత్రించలేదనీ.. గుడ్డపీలికలు కట్టుకుని నటించే హీరోయిన్లు నా చిత్రాల్లోకంటే కమర్షియల్ చిత్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయనీ, వాటినే ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారనీ, వాటికి ఆదాయం బాగా వస్తుందని అన్నారు. అందుకే ముందు ప్రేక్షకులే అటువంటి పోకడల్ని తిరస్కరించాలంటూ చెప్పాడు.

No comments:
Post a Comment