Saturday, November 26, 2011

స్త్రీ "సెక్స్"తోనే సంబంధాలను దృఢపరుచుకుంటోందా..?

సమాజం వేగంగా మారిపోతోంది. దానికి తగ్గట్లుగానే మనిషి అవసరాలు మారిపోతున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకుని ముందుకు సాగాలంటే ఒకరికొకరు సంబంధాలు చాలా చాలా దృఢంగా ఉండాలి......స్నేహాస్తం అందించేవారి పట్ల కృతజ్ఞతా భావం చూపించాలి. ఇదే ఇప్పుడు చాలామంది స్త్రీల విషయంలో మరో దారిని వెతికి చూపిస్తున్నట్లు పలు సర్వేల్లో వెల్లడవుతోంది. ఇంతకీ ఏమిటా దారి..?
ఇదివరకు వేర్వేరు కుటుంబాలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు - అబ్బాయిలు కలిసి తిరగడం చాలా చాలా అరుదైన విషయంగా కనిపించేది. ఇపుడు అలాక్కాదు. ఉద్యోగరీత్యా రాష్ట్రాల సరిహద్దులను దాటేసి వచ్చేస్తున్న అమ్మాయిలతోపాటు అబ్బాయిలు కూడా ఉంటున్నారు. కామన్‌గా కలుస్తున్నది మాత్రం ఉద్యోగం చేసే కార్యాలయమే. హలో.. హాయ్.. అంటూ మొదలైన పరిచయం.. ఒకరి అభిరుచులు ఇంకొకరికి నచ్చితే ఇంకాస్త ముందుకు వెళ్లిపోతోంది. వీకెండ్లూ.. పిజ్జా హట్లూ.. మల్టీప్లెక్స్‌లూ... షరా మామూలే.
అలా ప్రారంభమైన పరిచయం రకరకాల దారులు వెతుక్కుంటోంది. సదరు అబ్బాయి తన సమస్య( వ్యక్తిగత లేదా కుటుంబ)లను అమ్మాయికి చెపుతాడు. అమ్మాయి కూడా షరా మామూలే. ఈ సమస్యల సడిలో బాధాతప్త హృదయంతో కుంగిపోతున్న తన "పురుష" స్నేహితుడ్ని ఓదార్చేందుకు ఆ "స్త్రీ" మనసు కొట్టుకపోతుంది. అతడి మనసులోని బాధను పోగొట్టేందుకు ప్రేమగా స్పృశిస్తుంది. ఆ స్పర్శకు పురుషునిలోని "మగ"తనం మేల్కొని మరేదో దారి వెతుకుతుంది. అలా మొదలైన పరస్పర స్పర్శలు అంతకు ముందటి పరిచయ అక్షరాల్ని చెరిపేసి కొత్త పరిచయాల గవాక్షాలకై వెతుకుతుంది.
కానీ సదరు అమ్మాయి మనసులో ఏదో తెలియని భయం, జంకూ మెదలాడుతున్నప్పటికీ తమ మధ్య ఉన్న స్నేహబంధాన్ని వదులుకోలేని వింత స్థితి. చివరికి అబ్బాయి స్పర్శలు ముదిరి పాకానపడి పరిపరి విధాలా వేధిస్తుంటాయి. ఏదో కావాలని మారాం చేస్తుంటాయి. అది కూడదు.. అని తెలిసినా సంబంధాన్ని వదులుకోలేక, ఉద్యోగరీత్యా ఉన్న అనుబంధాన్ని కాదనలేని ఓ బలహీన స్థితిలో చాలామంది అమ్మాయిలు సెక్స్‌కు ఏదో ఒకరోజు ఓకే చెప్పేస్తున్నారట.
అలా మొదలైన సంబంధం పెళ్లికి దారితీస్తుందన్న నమ్మకం కూడా చాలామందికి ఉండదట. ఎందుకంటే ఎక్కడో అబ్బాయి.. ఇంకెక్కడో అమ్మాయి. ఊరుకాని ఊరు.. కానీ వృత్తిరీత్యా ఒకేచోట. అందుకే ఆఫీసు వరకే ఆ సంబంధం.. ఆ సహాయం, బదిలీ అయితే మళ్లీ అంతా కొత్తే.. మళ్లీ కొత్త స్నేహం.. ఇటువంటి వింతైన పరిస్థితుల్లో నేడు చాలామంది కొలీగ్స్ గడుపుతున్నారని తేలింది.

1 comment:

  1. Topic Good but Titile Doubt?

    మీ Style వేరే ఒప్పుకుంటాం, కాని ఇచ్చిన టాపిక్ నేటి సమాజ ధోరణి వాస్తవ స్తితులపై ఒక అవగాహనలా బాగున్నది కానీ Title అంత Generalize చెయ్యాల్సిన లేదేమో అనిపించింది నాకు, మీరేమంటారు?

    ?!

    ReplyDelete