Saturday, December 24, 2011

రవితేజ, దీక్షాసేథ్‌ల నిప్పు షూటింగ్ పూర్తి: జనవరి 13న విడుదల

మాస్‌ మహారాజా రవితేజ, దీక్షాసేథ్‌ హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు వారి పతాకంపై డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌..................... దర్శకత్వంలో డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ వై.వి.యస్‌.చౌదరి నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'నిప్పు' చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత వై.వి.యస్‌.చౌదరి మాట్లాడుతూ - ''డిసెంబర్‌ 11 నుంచి 20 వరకు టర్కీలో జరిగిన షెడ్యూల్‌లో రవితేజ, దీక్షాసేథ్‌లపై రెండు పాటలను, చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. టోటల్‌గా షూటింగ్‌ కంప్లీట్‌ అయింది. థమన్‌ రూపొందించిన ఆడియోను డిసెంబర్‌ చివరి వారంలో రిలీజ్‌ చేస్తున్నాం. ముందు చెప్పినట్టుగానే జనవరి 13నే 'నిప్పు' చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేస్తున్నాం'' అన్నారు.

రవితేజ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు గుణశేఖర్‌ చిత్రాల్లో వుండే కథాబలం, సాంకేతిక విలువలతో అన్‌కాంప్రమైజ్‌డ్‌ మేకింగ్‌ వేల్యూస్‌తో వై.వి.యస్‌.చౌదరి అందిస్తున్న ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌లో పొడుగుకాళ్ళ సుందరి దీక్షాసేథ్‌ హీరోయిన్‌గా నటించింది. నటకిరీటి డా|| రాజేంద్రప్రసాద్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. బ్రహ్మానందం, కృష్ణుడుల కామెడీ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎట్రాక్షన్‌. థమన్‌ మ్యూజిక్‌ ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ పాయింట్‌.

మాస్‌ మహారాజా రవితేజ సరసన దీక్షాసేథ్‌ కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో డా|| రాజేంద్రప్రసాద్‌, ప్రదీప్‌ రావత్‌, బ్రహ్మానందం, కృష్ణుడు, óర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌ దేవ్‌, బ్రహ్మాజీ, సుప్రీత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, శ్రీధర్‌ సీపన, సంగీతం: థమన్‌, సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఆర్ట్‌: ఆనంద్‌సాయి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: కనల్‌కణ్ణన్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, గణేష్‌ తరుపాయ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌.కిషోర్‌, కో-ప్రొడ్యూసర్స్‌: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వై.వి.యస్‌.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్‌.

No comments:

Post a Comment