Saturday, December 3, 2011

ఇండస్ట్రీలో మైలేజ్‌ను పెంచిన 2011

మిల్క్ బ్యూటీ తమన్నా ఈ ఏడాది స్పెషల్ అంటోంది. గత ఏడాదితో పోల్చుకుంటే 2011 తనకు అన్ని విధాలా........... కలిసొచ్చిందని తమన్నా చెబుతోంది. 2011లో తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్లు బాగా వచ్చాయని ఈ తెల్లపిల్ల అంటోంది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది ఇండస్ట్రీస్‌లో తన మైలేజ్‌ను పెంచిందని అందాల ముద్దుగుమ్మ తమన్నా చెప్పింది. 100 పర్సెంట్ లవ్‌లో మహాలక్ష్మిగా, బద్రినాథ్‌లో అలకందనగా అద్భుత పాత్రలు లభించాయి. ఊసరవెల్లిలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ అమ్మాయిగా తమన్నా నటించింది. అందుచేత ఈ ఏడాది తనకు బాగా కలిసొచ్చిందని తమన్నా చెబుతోంది. అంతేకాదు.. వచ్చే ఏడాది కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మంచి రోల్స్ చేస్తానని ఈ బ్యూటీ వెల్లడించింది.

No comments:

Post a Comment