Saturday, December 3, 2011

శారీరక వ్యాధులకు సర్వరోగ నివారిణి శృంగారం!!

sex couple
శృంగారం సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. వారానికి కనీసం మూడు రోజులైనా భార్యతో రతి క్రీడలో పాల్గొంటే శరీరం ఉల్లాసంగా ఉంటుందట. మరోలా చెప్పాలంటే.. రతిక్రీడ శరీర ఆరోగ్యాన్ని సంరక్షించే ఒక మంచి వ్యాయామంగా భావించవచ్చని వారు చెపుతున్నారు. వారానికి మూడు సార్లు రతిక్రీడను ఆచరిస్తే, అనేక కేలరీలు ఖర్చవుతాయట.

రతిక్రీడ రెగ్యులర్ చేస్తూ పోతే చక్కటి రక్తప్రసరణ కొలెస్ట్రాల్ మంచి స్థాయికి రావడం మొదలైన ప్రయోజనాలే కాక శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తుందట. చురుకుగా రతిక్రీడ చేసేవారి జీవితాలు మరింత దీర్ఘకాలం సాగుతాయని ఓ అధ్యయనం వెల్లడించింది.

శరీరంలో అవయవాలు, ఇతర భాగాలు చక్కగా పని చేసి ఆరోగ్యంగా ఉండగలరని దీంతో వివిధ అవయవాలలోని కణాలు శక్తివంతంగా ఉంటాయని, కొలెస్ట్రాల్, లేదా గుండె జబ్బు లు రాకుండా దివ్యమైన ఔషధంలా కూడా పని చేస్తుందని ఈ సర్వే తేల్చింది. పురుషుల్లో గుండె జబ్బుల రిస్కును యాభై శాతానికి తగ్గించుకోవచ్చని తెలుపుతోంది.

పైపెచ్చు.. శరీరంలో ఉన్న నొప్పులు కూడా రతిక్రీడతో తగ్గి సుఖంగా ఉంటాయని చెపుతున్నారు. ప్రస్తుత యాంత్రిక జీవనం ఎంతో ఒత్తిడితో కూడికుని వుంది. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు రతి క్రీడ ఓ దివ్యమైన ఔషధంగా దోహదపడుతుందని ఈ సర్వే తేల్చింది. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మెదడు, రక్తప్రసరణ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుందని, వారిలోని ఆందోళనలు దూరమవుతాయని పేర్కొంది.

No comments:

Post a Comment