స్టార్ హీరోయిన్లు షూటింగ్ స్పాట్‌లో అప్పుడప్పుడు అక్కడనొప్పి, ఇక్కడనొప్పి అంటూ కుంటిసాకులు చెప్పి, షూటింగ్ కాన్సిల్ చేసుకుని ఇంటికి చెక్కేస్తుంటారు..................
ఇటీవలే ఇలియానా అలాంటి డ్రామానే ఆడిందని తెలుస్తోంది. హిందీ '3 ఇడియట్స్' తమిళ రీమేక్ 'నన్బన్'లో హీరోయిన్ ఆమె. కథానాయకుడు విజయ్. బాలీవుడ్ నృత్యదర్శకురాలు ఫరాఖాన్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట సమయంలో కడుపులో నొప్పి ఉందని ఇలియానా వానిటీ వ్యాన్‌లో కూర్చుండిపోయిందట. ఆమెను ఆస్పత్రికి తీసుకెళితే ఏం ఫర్వాలేదు.. షూటింగ్‌లో పాల్గొనవచ్చని డాక్టర్ చెప్పారట.
అక్కడనుంచి షూటింగ్‌స్పాట్‌కు వచ్చిన తర్వాత కూడా నొప్పి ఉందని వ్యాన్‌లోనే కూర్చుండిపోవడంతో... ఫరాఖాన్‌కు కోపం వచ్చిందట. దాంతో ఇలియానా లేకుండా విజయ్, డాన్సర్లపై పాట చిత్రీకరించేశారట. మరి ఇలియానా అసలు ప్రాబ్లమ్ ఏమిటో తెలియాల్సి ఉంది.

No comments:
Post a Comment