Thursday, December 8, 2011

పవన్‌ కల్యాణ్ తర్వాతే ఇంకెవరైనా

పవన్‌ కళ్యాణ్‌ అంతగా ఎందుకు నచ్చాడో?!! ఆయన చిత్రంలో గెంతటానికి మినహా ఎవరు వచ్చినా ఏదో సాకు చెప్పి పంపిచేస్తుంది ఓ సెక్సీ హీరోయిన్...........................హీరోయిన్‌గా రెండుమూడు సినిమాలు చేసినా పెద్దగా లాభం లేకపోవడంతో ఐటంగాళ్‌గా చేయడానికి సిద్ధపడింది. ఇంతకీ ఈ భామ పేరు ఏంటయా.. అనే కదా మీ ప్రశ్న. ఆమే పార్వతిమెల్టన్‌.

మాంచి సెక్సీగా పొడుగు కాళ్లసుందరిగా కన్పించే ఈ అమ్మడు గెస్ట్‌ అప్పీయరెన్స్‌గా ఐటంగాళ్‌గా నటిస్తోంది. తను నటించిన చిత్రాలన్నీ హిట్‌ అయ్యాయి. జల్సా, దూకుడు మంచి కలెక్షన్లు రావడంతో నిర్మాతలు ఆమెను కోరుకుంటున్నారట. కానీ, మీరెవ్వరూ వద్దు. ఒక్క పవన్‌ ఉంటే చాలంటూ తన కోరికను వెల్లడిస్తుంది.

ఇటీవలే ఆమెను ఇద్దరు నిర్మాతలు తమ చిత్రంలో చేయమని అడిగారట. వారికి ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నదట. దానికి కారణం 'గబ్బర్‌సింగ్‌'లో పవన్ మంచి ఆఫర్ ఇచ్చాడట. ఆ చిత్రం తర్వాతే ఏదైనా అని వారిని పంపించేసిందట. 'దబాంగ్‌'లో పాపులర్‌ అయిన 'మున్సీ బదనామ్‌..' పాటకు పార్వతి కాలు ఆడిస్తుందట. దీనికోసం నిర్మాత గణేష్‌బాబు బాగానే ముట్టచెబుతున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment