Saturday, December 24, 2011

విష్ణును పట్టుకునే ఛాన్స్ కొట్టేసిన తెల్లపిల్ల హన్సిక!

విష్ణును పట్టుకునే ఛాన్సును హన్సిక కొట్టేసిందా? ఇదేంటి అనుకుంటున్నారా? అదేనండీ "ఢీ" హీరో మంచు విష్ణుతో నటించే ఛాన్సును తెల్లపిల్ల హన్సిక కొట్టేసింది...................ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. సలీమ్, వస్తాడు నారాజు వంటి వరుసగా ఫ్లాప్‌లను చవిచూసిన విష్ణు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. అందుకే "కందిరీగ"తో హిట్ కొట్టిన హన్సికను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు.

ఇంకా తొలి సినిమా ఢీ తరహాలో కామెడీ చిత్రాల దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలసింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీప్రసన్న నిర్మించనుంది. అలాగే ఈ చిత్రానికి "దొరకడు" అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారు.

No comments:

Post a Comment