Wednesday, December 28, 2011

నాకు ప్రియమణికి మధ్య లింక్ ఎలాంటిదంటారా..?

జగపతిబాబు అంటే ఏడాదికి ఎడాపెడా 4,5 సినిమాలు చేసేస్తూ అటు కార్మికులకు పని కల్పించే నటుడు........ఈ ఏడాది తనకు గ్రేట్‌ ఇయర్‌గా చెబుతున్నారు. శోభన్‌బాబు తర్వాత అంతటి నటుడు మహిళల ఆదరణగొన్నవాడిగా చెప్పుకునే జగపతిబాబు లేటెస్ట్‌గా ప్రియమణి కాంబినేషన్‌లో చేసిన సినిమా 'క్షేత్రం'. ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతలు మీకోసం....

'క్షేత్రం' సినిమా అంగీకరించడానికి కారణం?
ఆ కథ రియల్‌ స్టోరీ. రాయలసీమలోని ఓ ప్రాంతంలో జరిగిన కథ, దానికి దర్శకుడు వేణు తీర్చిదిద్దిన విధానం. కథ వింటున్నప్పుడు చాలా ఏంగ్జయిటీగా ఫీలయ్యాను.

ఇందులో మీది గెస్ట్‌ రోల్‌ అని విన్పిస్తున్నాయి?
మొదట్లో నాది గెస్ట్‌రోల్‌. కానీ కథరీత్యా అనుకోకుండా లక్ష్మీనరసింహస్వామితో సమానమైన పాత్ర. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నేపథ్యంలో జరిగే కథ.

కొత్త దర్శకుడు ఎలా తీశాడు?
నా అనుభవంలో చెప్పింది చెప్పినట్లుగా తీసే దర్శకుడు వేణు. సహజంగా కొత్త దర్శకుడంటే తేలికభావం ఉంటుంది. కానీ ఆయన సెట్లోకి వెళ్ళాక చాలా క్లారిటీతో ఉండేవాడు. ఈ కథ అరుంథతి ప్యాట్రన్‌లో ఉంటుంది. చాలా పెద్ద కథ. అన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. చిత్రం రషెస్‌ చూశాక ఎంతో ఆశ్చర్యమేసింది. నేను సహజంగా మగాళ్ళను హగ్‌ చేసుకోను. ఇది చూశాక కెమెరామెన్‌, దర్శకుడ్ని హగ్‌ చేసుకున్నాను.

ప్రియమణి పాత్ర ఎలా ఉంటుంది?
ప్రియమణి డబుల్‌ రోల్‌ ప్లే చేస్తుంది. ఆత్మ, దైవం రెండు అంశాల మధ్య జరిగే కథలో ఆమె నటన అద్భుతంగా చేసింది. సన్నివేశాలకు తగిన విధంగా కోటి రీ-రికార్డింగ్‌ హైలెట్‌గా నిలుస్తుంది.

ప్రియమణి కాంబినేషన్‌లో చేయడంలో ప్రత్యేకత?
(నవ్వుతూ..) మీ ఇష్టం.. ఆమెకు నాకు మధ్య ఉన్న సంబంధం గురించి ఏమైనా రాసుకోండి.. పెళ్ళయిన కొత్తలో మొదలైన మా కాంబినేషన్‌ ఇప్పటికి 4 సినిమాల వరకు సాగింది. సినిమాల్లో ఒక్కో కాంబినేషన్‌ ఒక్కొక్కరికి కుదురుతుంది. సౌందర్యతో కూడా కలిసి కొన్ని చిత్రాలు చేశాను. ప్రియమణి జాతీయ అవార్డు నటి. ఆమె బాగా నటించింది.

మీరూ అవార్డు కోసం ట్రైచేయలేదా?
అవార్డు రావాలంటే దర్శకుడే కీలకం. ఏదైనా ఆయన చేతుల్లోనే ఉంటుంది. నేను చేసే కొత్త చిత్రాలు ప్రయోగాత్మకమైనవి చేయాలనుకుంటాను. దర్శకుడు మదన్‌ 'పెళ్ళయినకొత్తలో' చేశాడు. బాగా తీశాడు. ఆ తర్వాత 'ప్రవరాఖ్యుడు' చెడగొట్టాడు. బాగా తీయలేకపోయాడు. అలాగే బాగా తీసే దర్శకుడుంటేనే అవార్డు వస్తుంది.

సినిమా ఆలస్యం కావడానికి కారణం?
ఇండస్ట్రీలో సమ్మె ప్రభావం బాగా పడింది. దానితోపాటు ఈ సినిమా అంతా రెడీ అయి గత నెలలోనే రిలీజ్‌ అయితే మంచిపేరు వచ్చేది. కానీ నిర్మాతలు సరైన పబ్లిసిటీ ఇచ్చుకోవడం చేతకాకపోవడంతో డిసెంబర్‌ 29కు వచ్చింది. ఈసినిమా నా కెరీర్‌లో బెస్ట్‌ చిత్రమవుతుంది. బహుశా ఈ ఏడాదిలో మంచి చిత్రమనే పేరు వస్తుంది.

సినిమాకు మీ ప్రాతిపదిక ఏమిటి?
నాకు ఓపిక చాలా తక్కువ. కథ నచ్చకపోతే చెబుతుండగానే వెళ్ళిపోతాను. బాగా నచ్చిందంటే.. ముందుగా లిస్టు రాసుకుంటాను. ఏది ఎలా చేయాలి. దేని తర్వాత ఎలా ఉండాలనేది ప్రిపరేషన్‌ చేసుకుంటాను.

తమిళ రంగంలో ప్రవేశిస్తున్నారని తెలిసింది?
అవును. మంచి ఆఫర్‌ వచ్చింది. వారు చెబితేనే బెటర్‌...

క్షేత్రం హిందీలో తీస్తున్నారని తెలిసింది?
హిందీలో రైట్స్‌ తీసుకున్నారు. వారికి కథ బాగా నచ్చింది. తమిళంలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాను.

కొత్త సినిమాలు?
నందీశ్వరుడు చేస్తున్నాను. దాని తర్వాత మరో మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి.

కొత్త సంవత్సరంలో నిర్ణయాలు?
నిర్ణయాలు అంటూ ఏమీలేవు. 2012 సంవత్సరం ఇండస్ట్రీకి బాగుండాలి. గత ఏడాది చేదు అనుభవాలు రిపీట్‌ కాకుండా చూడాలని కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment