Monday, January 16, 2012

ఫోర్‌ప్లే‌లో స్త్రీ ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి?

couple
సెక్స్‌ మనిషికి అవసరమా? కాదా? సెక్స్‌ లేకుండా మనిషి జీవించ లేడా? అంటే జవాబు వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. ఆయుర్వేదం మనిషిని ముక్కలు ముక్కలుగా కాకుండా శరీరం...................................................... మనసు, ఆత్మ వీటన్నిటినీ సమ్మిశ్రమంగా చెప్పి మనిషిని మొత్తంగా చికిత్స చేయాలని చెబుతుంది. అలాగే సెక్సాలజీ కూడా మనిషిని పూర్తిగా, అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించాలని చెబుతుంది. మనిషి, శరీరం, హార్మోనులు, పుట్టి పెరిగిన పరిస్థితులు, సామాజిక విలువలు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, ఆశయాలు వీటన్నింటిని చూడాల్సి ఉంటుంది.

సెక్స్‌లో పాల్గోవాలంటే పార్ట్‌నర్‌ ఇష్టా ఇష్టాలు తెలుసు కోవడం అవసరం. తమకిష్టమైనవి, లేనివి స్త్రీ తన నోటితో చెప్పలేకపోవచ్చు. అలాంటివి ఫోర్‌ప్లేలో, రతిలో ఏమేం చేస్తుంటే ఉద్రేకం కలుగుతుంది. ఎక్కడ చేయి వేస్తే తీసి వేస్తున్నారు... ఎక్కడ చేయి ఉంచుకుంటున్నారు... ఇలాంటివి పరిశీలన ద్వారా గ్రహించాలి.

పెళ్ళికి ముందు తర్వాత వేశ్యలతో తిరిగేవారు సుఖ వ్యాధులేవీ లేకుండా చేసుకొని మాత్రమే భార్యతో శృంగారంలో పాల్గొనాలి. వేశ్యాసంభోగం మానివేస్తే మంచిది. గర్భం వద్దనుకున్నపుడు వివిధ గర్భనిరోధక పద్దతులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి ముందుగా తెలుసుకోవాలి. లేకపోతే మనసులో గర్భం వస్తుందేమో అన్న భయం ఉంటే ఇద్దరూ శృంగారంలో సరిగా పాల్గొనలేకపోవచ్చును.

సెక్స్‌లో కొన్ని వాటంతటవే కలిగినా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అంగస్తంభనాలు గర్భస్థ పిండానికి కూడా వాటంతటవే కలుగుతాయి. సెక్స్‌లో తృప్తి పొందడం, వీర్యస్ఖలనంపై నియంత్రణ, భావప్రాప్తి పొందడం ఇవి నేర్చుకోవాలి. అలాగే... ఏవి కామోద్రేకాన్ని కలిగిస్తాయి అన్నది నెమ్మదిగా తెలుసుకుంటారు.

శృంగారంలో తృప్తినిచ్చే వాటిలో పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమే. వాత్సాయనుడు వ్యక్తిగత పరిశుభ్రత, చక్కని పరిసరాలు, సుఖంగా ఉండే బెడ్‌రూమ్‌కు ప్రాధాన్యతనిచ్చాడు. వస్త్రాలు లేకుండా ఒకరి శరీరాన్ని ఒకరు సాధ్యమైనంతసేపు ప్రేరేపించి అప్పుడు సెక్స్‌లో పాల్గొనడం వల్ల సుఖమయ సెక్స్ జీవితానికి మార్గాలుగా సెక్స్ నిపుణులు చెపుతున్నారు.

No comments:

Post a Comment